జీవిత బీమా విషయానికొస్తే మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఎంపిక ఉత్తమం? – జితేంద్ర
జీవిత బీమా పాలసీ కొనుగోలు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. ఆర్థికంగా తమపై ఆధారపడిన వారుంటే తప్పకుండా దీన్ని తీసుకోవాలి. తమకు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు కుటుంబ అవసరాలను ఆదుకుంటుంది. మనీబ్యాక్, యులిప్, పెన్షన్ ప్లాన్లు ఇవన్నీ హైబ్రిడ్ బీమా ఉత్పత్తుఉలు. ఇవి జీవిత బీమాతోపాటు పెట్టుబడుల ప్రయోజనాన్ని ఆఫర్ చేస్తుంటాయి. దీంతో చూడానికి ఆకర్షణీయంగా అనిపిస్తాయే కానీ, వాస్తవంలో కాదు. ఎందుకంటే ఈ తరహా పాలసీలు తగినంత జీవిత బీమా రక్షణను ఇవ్వవు.
భారీ రక్షణ కోరుకుంటే ప్రీమియం చాలా ఖరీదుగా మారుతుంది. ఇక ఈ ప్లాన్లలో పెట్టుబడులపై రాబడులు చాలా తక్కువ. కనుక బీమా, పెట్టుబడులను వేర్వేరుగా నిర్వహించుకోవడం మంచిది. పెట్టుబడుల కోసం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. జీవిత బీమా కోసం అచ్చమైన టర్మ్ ప్లాన్‌ను పరిశీలించాలి.
హైబ్రిడ్ ప్లాన్లతో పోల్చి చూస్తే టర్మ్ ప్లాన్ల ప్రీమియం ఎంతో అందుబాటులో ఉంటుంది. 35 ఏళ్ల ఆరోగ్యవంతుడైన పురుషుడికి రూ.కోటి కవరేజీకి ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.15,000. చాలా మంది బీమా పాలసీని ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా తీసుకుంటుంటారు. దీంతో వారు తమకు అధిక కమీషన్ లభించే హైబ్రిడ్ ప్లాన్లను అంటగడుతుంటారు.
అచ్చమైన టర్మ్ ప్లాన్‌లో జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం రాదు. అలాంటివి టర్మ్ ప్లాన్లు అని సులభంగా గుర్తించొచ్చు. కేవలం పాలసీదారు మరణించిన సందర్భంలోనే ఈ ప్లాన్ల కింద పరిహారం అందుతుంది. కానీ, హైబ్రిడ్ ప్లాన్లు జీవించి ఉన్నా కానీ, చివర్లో కొంత మొత్తాన్ని వెనక్కిస్తాయి. ఇందుకోసం అవి అధిక ప్రీమియం వసూలు చేస్తాయి.
మంచి డైనమిక్ బాండ్ ఫండ్స్ ఏవి? – వినయ
డెట్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ స్వల్పకాల అవసరాలకు ఉద్దేశించిన నిధులను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రక్షణ ఉంటుంది. అస్థిరతలు లేకుండా ఊహించతగిన ఆదాయం కోసం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఎంపిక చేసుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లకు షార్డ్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి సురక్షితమైనవి. స్థిరత్వంతోపాటు నిలకడైన రాబడులు అందిస్తాయి.
డైనమిక్ బాండ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటే.. ముందుగా ఆ విభాగంలోని పథకాల పనితీరు వివిధ వడ్డీ రేట్ల సైకిల్స్‌లో ఎలా ఉందన్నది విశ్లేషించండి. సంబంధిత ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని డెట్ పత్రాల క్రెడిట్ నాణ్యతను కూడా పరిశీలించాలి. నిర్వహణ ఆస్తుల పరంగా టాప్–10 డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో ఐసీఐసీఐ, కోటక్, ఎస్‌బీఐ పథకాలు మెరుగ్గా ఉన్నాయి.
హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ఎక్స్‌పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్
హెచ్‌ఎస్‌బీసీ మ్యుచువల్ ఫండ్ కొత్తగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ఎక్స్‌పోర్ట్ ఆపర్చూనిటీస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 19తో ముగుస్తుంది. ఉత్పత్తులు లేదా సర్వీసుల ఎగుమతుల వల్ల లబ్ధి పొందే సంస్థల షేర్లు, అలాగే ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తయారీ, ఆటోమొబైల్స్, పారిశ్రామికోత్పత్తులు, ఫార్మా, రసాయనాలు, టెక్స్‌టైల్స్, నిర్మాణం మొదలైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపార ఫండమెంటల్స్, పరిశ్రమ స్వరూపం, వేల్యుయేషన్, ఆర్థిక బలా లు వంటి అంశాల ప్రాతిపదికన షేర్ల ఎంపిక ఉంటుందని సంస్థ సీఐవో–ఈక్విటీ వేణుగోపాల్ మంగత్ తెలిపారు.
కోటక్ నిఫ్టీ ఇండియా టూరిజం ఇండెక్స్ ఫండ్
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తాజాగా కోటక్ నిఫ్టీ ఇండియా టూ రిజం ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది సెప్టెంబర్ 16తో ముగుస్తుంది. నిఫ్టీ500లో ట్రావెల్, టూరిజం థీమ్ ఉన్న షేర్లను ఎంచుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను బట్టి ఇండెక్స్‌లోని ఒక్కో స్టాక్‌కి వెయి టేజీ ఉంటుంది. పర్యాటక రంగానికి చోదక విభాగాలు ఇందులో ఉంటాయి. విహారయాత్రలు, వ్యాపార సంబంధ ప్రయాణాలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు లబ్ధి పొందవచ్చని సంస్థ ఎండీ నీలేశ్ షా
తెలిపారు.
యూటీఐ నుంచి రెండు ఇండెక్స్ ఫండ్ ఆఫర్లు
యూటీఐ ఫండ్ 2 ఇండెక్స్ ఫండ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూటీఐ నిఫ్టీ ప్రైవేటు బ్యాంక్ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ200 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఆఫర్లను (ఎన్‌ఎఫ్‌వో) ప్రారంభించింది. ఇండెక్స్ ఫండ్ నిర్వ హణలో తమకున్న విస్తృతమైన అనుభవంతో తక్కువ వ్యయాలతో కూడిన అత్యధిక నాణ్యమైన పెట్టుబడుల ఆప్షన్లు అందిస్తున్నట్టు ఫండ్ పేర్కొంది. యూటీఐ నిఫ్టీ 200 క్వాలిటీ 30 ఇండెక్స్‌ఫండ్ అన్నది ఇదే సూచీలోని స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ 2 పథకాల ఎన్‌ఎఫ్‌వోలు 16న ముగుస్తాయి. కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ లేదు.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment