మన దేశంలో చాలా మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే బీమా పథకాలను వినియోగించుకుంటున్నారు. దేశ ప్రజలందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలన్న సదుద్దేశ్యంతో కేంద్రం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనే పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలకు వినియోగించుకునే వారు ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలి ఉంటుంది.
కొంతమంది వినియోగదారులు ఈ స్కీమ్ కింద అమౌంట్ చెల్లించడానికి వారి బ్యాంక్ అకౌంట్ లింక్ యాడ్ చేసి ఉంటారు. కావున దీని ద్వారా సమయానికి అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. అయితే ఆ సమయానికి ఖాతాలో సరైన అమౌంట్ ఉండేలా చూసుకోవాలి. ఈ స్కీమ్స్ ఉపయోగించుకునే వారు మే 31 లోపు తప్పకుండా ఖాతలో రూ. 456 ఉండేలా చూసుకోవాలి.
పీఎమ్‌జేజేబీవై అనేది వన్ ఇయర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు చేరవచ్చు. పాలసీ తీసుకున్న వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల వరకు భీమా లభిస్తుంది. ఈ కవరేజ్ జూన్ 1 నుంచి మే 31 స్కీమ్ కవరేజ్ లభిస్తుంది.
ఇక ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ప్రమాదవ శాత్తు పాలసీదారుడు చనిపోతే వారి కుటుంబాలకు నిర్దిష్ట అమౌంట్ వస్తుంది. ఒక వేళా ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా పాలసీ డబ్బులు లభిస్తాయి. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్‌లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ)
బ్యాంకులు మే 25 నుంచి మే 31 వరకు ప్రతి ఏడాది ఈ పాలసీ డబ్బులను కట్ చేసుకుంటూ ఉంటుంది. కావున ఈ రెండు స్కీమ్స్ కలుపుకుని బ్యాంక్ నుంచి రూ. 456 కట్ చేసుకుంటారు. కాబట్టి మే 31 నాటికి తప్పకుండా ఖాతాలో రూ. 456 ఉండేట్లు చూసుకోవాలి.
(ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..)
కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. అయితే కేంద్రం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని పెంచడం కూడా జరిగింది. గతంలో పీఎంజేజేబీ స్కీమ్ కోసం ప్రీమియం రూ. 330 మాత్రమే ఉండేది, అది ఇప్పుడు రూ. 436 కి పెరిగింది. అదే సమయంలో పీఎంఎస్‌బీ ప్రీమియం రూ. 12 నుంచి రూ. 20 కి పెంచారు. ఈ కొత్త ధరలు 2022 జూన్ 01 నుంచి అమలులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment