PMSBY
-
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ రెండు పథకాలు ఇక ఈజీగా..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తమ కస్టమర్లకు చక్కని అవకాశాన్ని కల్పించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలకు కస్టమర్లు తామంతట తామే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటిచించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసుకున్న వ్యక్తి ఆకస్మికంగా మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి రూ. 2,00,000 లభిస్తాయి.ఇది ప్యూర్-టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఎలాంటి మెచ్యూరిటీ లేదా సరెండర్ ప్రయోజనాన్ని అందించదు. ఇక ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా పథకం. ఇది ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా వైకల్యం కలిగినప్పుడు ప్రయోజనం అందిస్తుంది. ఇది ప్రాథమికంగా ఒక సంవత్సరానికి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవచ్చు. అర్హులైన పౌరులందరికీ బీమా కవరేజీని విస్తరించడం, ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత కల్పించడం అనే విస్తృత జాతీయ లక్ష్యానికి అనుగుణంగా ఈ డిజిటల్ ఎన్రోల్మెంట్ ఉంటుందని ఎస్బీఐ బ్యాంక్ పేర్కొంది. స్వీయ-చందా మార్గంలో కస్టమర్లు బ్రాంచ్ లేదా కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను సందర్శించకుండానే వారి సౌలభ్యం మేరకు ఆన్లైన్లోనే ఈ స్కీమ్‌ల కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకునేటప్పుడు కస్టమర్లు తమ ఖాతా నంబర్, పుట్టిన తేదీని జన్ సురక్ష పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వారి ప్రాధాన్య బ్యాంక్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దశలను పూర్తి చేసి ప్రీమియం చెల్లించిన వెంటనే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
మీ బ్యాంక్ అకౌంట్లో రూ. 456 ఉండేలా చూసుకోండి! లేదంటే..
మన దేశంలో చాలా మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే బీమా పథకాలను వినియోగించుకుంటున్నారు. దేశ ప్రజలందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలన్న సదుద్దేశ్యంతో కేంద్రం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనే పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలకు వినియోగించుకునే వారు ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలి ఉంటుంది. కొంతమంది వినియోగదారులు ఈ స్కీమ్ కింద అమౌంట్ చెల్లించడానికి వారి బ్యాంక్ అకౌంట్ లింక్ యాడ్ చేసి ఉంటారు. కావున దీని ద్వారా సమయానికి అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. అయితే ఆ సమయానికి ఖాతాలో సరైన అమౌంట్ ఉండేలా చూసుకోవాలి. ఈ స్కీమ్స్ ఉపయోగించుకునే వారు మే 31 లోపు తప్పకుండా ఖాతలో రూ. 456 ఉండేలా చూసుకోవాలి. పీఎమ్‌జేజేబీవై అనేది వన్ ఇయర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ కింద రూ. 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 18 నుంచి 50 సంవత్సరాల వయసున్న వారు చేరవచ్చు. పాలసీ తీసుకున్న వారు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల వరకు భీమా లభిస్తుంది. ఈ కవరేజ్ జూన్ 1 నుంచి మే 31 స్కీమ్ కవరేజ్ లభిస్తుంది. ఇక ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ప్రమాదవ శాత్తు పాలసీదారుడు చనిపోతే వారి కుటుంబాలకు నిర్దిష్ట అమౌంట్ వస్తుంది. ఒక వేళా ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా పాలసీ డబ్బులు లభిస్తాయి. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్‌లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ) బ్యాంకులు మే 25 నుంచి మే 31 వరకు ప్రతి ఏడాది ఈ పాలసీ డబ్బులను కట్ చేసుకుంటూ ఉంటుంది. కావున ఈ రెండు స్కీమ్స్ కలుపుకుని బ్యాంక్ నుంచి రూ. 456 కట్ చేసుకుంటారు. కాబట్టి మే 31 నాటికి తప్పకుండా ఖాతాలో రూ. 456 ఉండేట్లు చూసుకోవాలి. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. అయితే కేంద్రం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని పెంచడం కూడా జరిగింది. గతంలో పీఎంజేజేబీ స్కీమ్ కోసం ప్రీమియం రూ. 330 మాత్రమే ఉండేది, అది ఇప్పుడు రూ. 436 కి పెరిగింది. అదే సమయంలో పీఎంఎస్బీ ప్రీమియం రూ. 12 నుంచి రూ. 20 కి పెంచారు. ఈ కొత్త ధరలు 2022 జూన్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. -
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!
2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బీమా గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది. ఎస్బీఐ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.342తో డబ్బులు కడితే ఏకంగా రూ.4 లక్షల విలువ గల భీమా ప్రయోజనం మీరు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పిఎంఎస్బివై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పిఎంజెజెబివై) మీకు రూ.4 లక్షల వరకు ప్రమాద బీమా + జీవిత బీమా అందిస్తున్నాయి. అయితే, దీని కోసం మీరు కేవలం రూ.342 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఎస్బీఐ కస్టమర్లు ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఖాతాదారుడి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం కట్ అవుతుంది అని బ్యాంకు తెలియజేసింది. Get the insurance that suits your need and live life worry-free.#PMSBY #PMJJBY #SBI #Insurance pic.twitter.com/n7DC4eTlOV — State Bank of India (@TheOfficialSBI) October 2, 2021 (చదవండి: జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా తీసుకున్న ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా వికలాంగులైనా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యం పొందినట్లయితే అతడు/ఆమెకు లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది. దీనిలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా చేరవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు వరకు పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం కూడా మీరు కేవలం రూ.330 వార్షిక ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుందని తెలుసుకోవాలి. భీమా పొందాలంటే మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ప్రీమియం మినహాయింపు సమయంలో బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా బీమాను రద్దు చేసుకోవచ్చు. (చదవండి: ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్) -
పన్నెండు రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా
భవిష్యత్ ప్రమాదాల నుంచి కుటుంబాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ బీమా పొందడం చాలా ముఖ్యం. అయితే, పేద ప్రజలు అధిక ప్రీమియం గల పాలసీ తీసుకోవడం భారం కాబట్టి, వారికి సహాయం చేయడం కోసం 2015లో కేంద్రం ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనను తీసుకొచ్చింది. దీనిలో మీరు సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు భీమా పొందవచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) అనేది ప్రమాదవశాత్తు మరణం, వైకల్యానికి సంబంధించి బీమాను అందించే పథకం. ఈ బీమాకు సంబంధించి.. ఈ నెల మే 31 లోపు బ్యాంకులు రూ.12 ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుంచి కట్ చేస్తాయి. ఇప్పటికే మీ ఖాతా నుంచి రూ.12 కట్ అయితే మీకు రూ. 2 లక్షల రూపాయల ప్రమాద భీమా లభిస్తుంది. ప్రీమియం: పీఎంఎస్బీవై ఒక సంవత్సరం బీమా పథకం. వార్షిక ప్రీమియాన్ని జీఎస్టీతో సహా రూ.12 గా నిర్ణయించారు. పీఎంఎస్బీవై ప్రయోజనాలను పొందడానికి ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలి. అర్హత: బ్యాంకు ఖాతాగల 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ ప్రమాదవ శాత్తు భీమా కోసం నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ, వ్యక్తికి బహుళ బ్యాంకు ఖాతాలు ఉంటే ఒక ఖాతా ద్వారా మాత్రమే బీమాలో చేరవచ్చు. పీఎంఎస్‌బీవైకి ఎలా ధరఖాస్తు చేసుకోవాలి? ఈ పథకంలో చేరడానికి ఒక దరఖాస్తును బ్యాంకులో సమర్పించాలి. వ్యక్తి తమ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, వయస్సు ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. బీమా ప్రయోజనం… పీఎంఎస్బీవై అనేది ప్రమాద బీమా పథకం, ప్రమాదం కారణంగా మరణిస్తే లేదా వైకల్యం చెందితే బీమా అందించబడుతుంది. గుండెపోటు మొదలైన సహజ కారణాల వల్ల జరిగే మరణాలకు బీమా కవర్ అందించబడదు. ఈ పథకం కింద రిస్క్ కవరేజ్ ప్రమాదవశాత్తు మరణం మరియు పూర్తి వైకల్యానికి రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష, ఖాతాదారుడి మరణం తర్వాత బీమా చేసిన వ్యక్తి నామినీ యొక్క బ్యాంక్ ఖాతాకు బీమా క్లెయిమ్ చెల్లిస్తారు. చదవండి: అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్‌లు నింపాల్సిందే -
రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పొందండి
ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు చూశాక? ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని భవిష్యత్ సమస్యల నుంచి సురక్షితంగా ఉంచడానికి బీమా పొందడం చాలా ముఖ్యం. అయితే, భీమా ప్రీమియం చెల్లించడం అనేది అంత తేలికైన విషయం కాదు. మరి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ప్రీమియాన్ని భరించలేక బీమా తీసుకోవడం మానేస్తారు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి కేంద్రం ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనను 2015లో తీసుకొచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనలో చేరడానికి సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా 2 లక్షల వరకు భీమా పొందవచ్చు. ఇతర భీమా పాలసీలతో పోలిస్తే ఈ ప్రమాద బీమా పథకం చాలా చౌకగా ఉంటుంది. బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తును భద్రతతో పాటు కుటుంబ సభ్యులు ఆర్ధికంగా సురక్షితంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. దీని కింద చేరిన వారికి ఏదైనా ప్రమాదవశాత్తు మరణం, పూర్తి వైకల్యానికి గురైతే రూ.2లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష రూపాయలు అందుతాయి. ప్రీమియం కింద ఏడాదికి రూ.12 మొత్తాన్ని ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా నుంచి (ఆటో-డెబిట్' సౌకర్యం ఉంది) కట్ చేస్తారు. అర్హత: 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వార్షిక పునరుద్ధరణ ప్రాతిపదికన జూన్ 1 నుండి మే 31 కాలానికి భీమా కవరేజ్ అందుతుంది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ తప్పని సరిగా లింకు అయ్యి ఉండాలి. కావాల్సిన పత్రాలు: అప్లికెంట్ ఆధార్ కార్డు గుర్తింపు కార్డు బ్యాంక్ ఖాతా పాస్ బుక్ వయస్సు ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నెంబర్ పాస్ పోర్ట్ ఫోటో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనకు ధరఖాస్తు చేసుకోవడానికి మీ బ్యాంక్ హోమ్ సంప్రదించవచ్చు లేదా వివరణాత్మక సమాచారం కోసం మీరు PM Surkasha Bima Yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. చదవండి: కరోనా సంక్షోభంపై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు -
కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా?
కరోనాతో ఎవరైనా మీ బందుమిత్రులలో మరణిస్తే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజెజెబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్ బీవై) పథకాల కింద వారికి రెండు లక్షలు పరిహారం కేంద్రం ఇస్తున్నట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఇలా ఉంది.. “కోవిడ్ -19 కారణంగా లేదా ఏదైనా కారణం చేత మీ దగ్గరి బంధువు/స్నేహితుల సర్కిల్లో ఎవరైనా మరణించినట్లయితే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఖాతా స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీని బ్యాంకులో అడగండి. ఖాతా స్టేట్మెంట్ లో ఈ మధ్యలో రూ.12 లేదా రూ.330 కట్ అయిందేమో గుర్తించండి, ఒకవేల కట్ అయితే వారు బ్యాంకుకు వెళ్లి రూ.2లక్షల కోసం బీమా క్లెయిమ్ చేసుకోండి". ప్రస్తుతం కోవిడ్ సంక్షోభంతో దేశం పోరాడుతున్న సమయంలో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ వార్తలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇది ఒకటి. దేశవ్యాప్తంగా పొదుపు బ్యాంకు ఖాతాలు గల పౌరులకు సరసమైన ప్రీమియంతో సామాజిక భద్రత కల్పించడానికి 2015లో ప్రభుత్వం ఈ రెండు పథకాలను జన ధన్ - జన్ సురక్ష యోజన కింద ప్రారంభించింది. కోవిడ్ మరణాలకు(కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే) పీఎంజెజెబీవై పథకం వర్తిస్తుందనేది నిజమే కానీ, పీఎంఎస్ బీవై కింద ప్రమాదవశాత్తు మరణం పొందిన లేదా 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ప్రమాదంలో శాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షల బీమా అందిస్తుంది. కోవిడ్ -19 మరణాలను ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రమాదవశాత్తు మరణం కింద పరిగణించరు. ఇందులో చెప్పినట్టు పీఎంజెజెబీవై కింద ఉన్నవారు ఎవరైనా మరణిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే లభిస్తాయని, పీఎంఎస్ బీవై కింద లభించవు అని పీఐబి ఫాక్ట్ చెక్ పేర్కొంది. Claim: Kins of those who died of COVID-19 can claim insurance under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)#PIBFactCheck: PMSBY doesn't cover COVID related deaths, while PMJJBY covers COVID deaths with certain conditions. pic.twitter.com/3g9AS4dVTe — PIB Fact Check (@PIBFactCheck) September 25, 2020 చదవండి: ఏటీఎం కార్డు పోతే ఇలా చేయండి..! -
నెలకు రూపాయితో రూ.2 లక్షల బీమా
బద్వేలు: భారత ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక సురక్ష పథకాలలో ముఖ్యమైనది ప్రధానమంత్రి సురక్ష బీమా (పీఎంఎస్బీవై) ఒకటి. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకు, వైకల్యానికి ఏడాది సమయానికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ప్రతి ఏటా దీన్ని తిరిగి పొడగించుకోవాలి. కనీస ప్రీమియం రేటు ఏడాదికి రూ.12గా ఉండే ఈ పాలసీ పేదవాళ్లకు, అల్పాదాయ వర్గాలకు వరంగా చెప్పవచ్చు. ఈ బీమా యోజనలో మరణం/శ్వాశిత వైకల్యం సంభవిస్తే రూ.రెండు లక్షల జీవిత బీమా, శాశ్విత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా సౌకర్యం అందుతుంది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి ఈ బీమా సౌకర్యం పొందవచ్చు. ఈ బీమా పథకంపై పూర్తి వివరాలు ఇలా.. ప్రీమియం:ఒక వ్యకి ఏడాదికి జూన్ ఒకటిగాని లేదా అంతకంటే ముందుగాని తమ బ్యాంకుఖాతా నుంచి రూ.12 ఆటో డెబిట్ పద్ధతిలో వసూలు చేస్తారు. జూన్ ఒకటి తరువాత ప్రీమియం చెల్లిస్తే తరువాత నెల నుంచి బీమా సౌకర్యం వర్తిస్తుంది. అర్హతలు: భాగస్వామ్య బ్యాంకులో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పొదుపు ఖాతాదారులు ఆటో డెబిట్‌ను అంగీకరించి పై విధానంలో పథకంలో చేరవచ్చు. బీమా వర్తించని సందర్భాలు:70 ఏళ్ల వయస్సు దాటిన తరువాత, బ్యాం కు ఖాతా మూసివేసినప్పుడు, బీమాను కొనసాగించడానికి ఖాతాలో తగినంత సొమ్ము లేనప్పుడు బీమా వర్తించదు. ప్రీమియం పంపకం:బీమా సంస్థకు చెల్లించే వార్షిక ప్రీమియం ఒక సభ్యుడికి ఏడాదికి రూ.10 మాత్రమే. మిగిలిన రెండు రూపాయలలో బీసీ/మైక్రో/కార్పొరేట్/ఏజెంట్‌కు ఖర్చుల చెల్లింపు ఒక సభ్యుడికి ఏడాదికి రూపాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి ఒక రూపాయి ఇస్తారు. ♦ ఈ బీమా పథకం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా మరణం, ప్రమాదాలు/అవిటితనం సంభవిస్తే పాలసీ కింద బీమా వర్తిస్తుంది. ఆత్మహత్యలకు వర్తించదు. హత్యలకు వర్తిస్తుంది. క్లెయిం పొందడమిలా..: అకాల మరణం/అవిటితనం పొందితే బీమా పరిహారం పొందేందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. బీమాదారుడు అకస్మాత్తుగా మరణిస్తే పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదం గురించి అతడి సంబంధీకులు రిపోర్టు ఇవ్వాలి. ఆస్పత్రి రికార్డుల ద్వారా వెంటనే ధ్రువీకరించాల్సి ఉంటుంది. పాలసీ దరఖాస్తులో పేర్కొన్న నామినీ క్లెయిం చేసుకోవచ్చు. అదే అవిటితనం గురించి క్లెయిం చేసుకోవాలంటే సూచించబడిన మొత్తాన్ని పాలసీదారుడి ఖాతాలో జమ చేస్తారు. -
నేషనల్ ఇన్సూరెన్స్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాన్ని అమలు చేసేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్)తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎంవోయూ పత్రాలను ఎన్ఐసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ భార్గవా డీ నుంచి ఎస్బీహెచ్ చీఫ్ జనరల్ మేనేజర్ విశ్వనాథన్ మంగళవారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ అండ్ జీఏ జీఎం శివశ్రీ వీ, డిప్యూటీ జనర ల్ మేనేజర్ థరాకాన్ టీటీఎం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ఎంఎస్‌లు పాల్గొన్నారు. ఒక్కో పాలసీకి ఏడాదికి రూ.12 చొప్పున పీఎంఎస్బీవై 1,821 ఎస్బీహెచ్ శాఖల్లో అమలులో ఉంటుంది. 18-70 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న అందరు ఎస్బీహెచ్ కస్టమర్లకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాద బీమా రూ.2 లక్షల వరకూ అందుతుంది.