నేషనల్ ఇన్సూరెన్స్‌తో ఎస్‌బీహెచ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాన్ని అమలు చేసేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్)తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎంవోయూ పత్రాలను ఎన్‌ఐసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ భార్గవా డీ నుంచి ఎస్‌బీహెచ్ చీఫ్ జనరల్ మేనేజర్ విశ్వనాథన్ మంగళవారం అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్ అండ్ జీఏ జీఎం శివశ్రీ వీ, డిప్యూటీ జనర ల్ మేనేజర్ థరాకాన్ టీటీఎం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ఎంఎస్‌లు పాల్గొన్నారు. ఒక్కో పాలసీకి ఏడాదికి రూ.12 చొప్పున పీఎంఎస్‌బీవై 1,821 ఎస్‌బీహెచ్ శాఖల్లో అమలులో ఉంటుంది. 18-70 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న అందరు ఎస్‌బీహెచ్ కస్టమర్లకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాద బీమా రూ.2 లక్షల వరకూ అందుతుంది.