న్యూఢిల్లీ: టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మెట్రోలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలు వివేకాన్ని ప్రదర్శిస్తున్నారు. జైపూర్, పాట్నా, పుణె తదితర పట్టణాల్లో ఎక్కువ మంది ప్రజలు అచ్చమైన బీమా ఉత్పత్తిగా పరిగణించే టర్మ్ ప్లాన్లను తీసుకుంటున్నట్టు మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ సర్వే’లో తెలిసింది.
ఇక్కడ ఏజెంట్ల ద్వారా టర్మ్ ప్లాన్లను ఎక్కువ మంది తీసుకుంటుంటే, అదే సమయంలో ఆన్‌లైన్ చానళ్లపైనా గణనీయమైన సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో 3,500 మంది ప్రజల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. జీవిత బీమా ఉత్పత్తుల పట్ల విజ్ఞానం పట్టణ ప్రజల్లో 2019లో 39గా ఉంటే, అది తాజా సర్వేలో 57కు పెరిగింది. జీవిత బీమా ఉత్పత్తులను కలిగి ఉన్న వారిలోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. 73 శాతానికి చేరింది. టర్మ్ ఇన్సూరెన్స్ విలువను అర్థం చేసుకోవడం మొదలైందని, మరింత మందికి దీన్ని చేరువ చేసేందుకు జీవిత బీమా పరిశ్రమ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment