tier 2 cities
-
ఇక్కడ ఇళ్ల ధరలకు రెక్కలు..
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. జైపూర్ టాప్.. టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం. ఉత్తరాదిన ఆగ్రా.. ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.పశ్చిమాన గాంధీనగర్ పశ్చిమభారత్లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్‌లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.బలంగా డిమాండ్.. ‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు. -
క్విక్ కామర్స్‌లోకి మరిన్ని బ్రాండ్లు
న్యూఢిల్లీ: క్విక్కామర్స్కు పట్టణ వాసుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో.. ప్రముఖ బ్రాండ్లు అమ్మకాలు పెంచుకునేందుకు ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్యాబ్ ఇండియా, డెకథ్లాన్, అడిడాస్, యూఎస్ పోలో, బోట్ తదితర ప్రముఖ బ్రాండ్లు బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ప్లాట్‌ఫామ్‌లపై తమ ఉత్పత్తులను ఇటీవలి కాలంలో లిస్ట్ చేశాయి. పుమా, స్కెచర్స్ సైతం క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్టింగ్‌కు ఉత్సాహం చూపిస్తున్నాయి. ‘‘ఇది కేవలం ఆరంభమే. వేగం, సౌకర్యం దేశంలో ప్రజల షాపింగ్ తీరును మార్చివేయనున్నాయి’’అని జెప్టో అప్పారెల్ లైఫ్‌స్టయిల్ హెడ్ ఆస్థా గుప్తా తెలిపారు. క్విక్ కామర్స్ సంస్థలు ఇంతకాలం మెట్రోలకే పరిమితం కాగా, టైర్–2, 3 పట్టణాల్లోకి విస్తరిస్తున్నాయి. కనుక ఈ విభాగాన్ని ప్రముఖ బ్రాండ్లు నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు చెందిన ‘తస్వ’ మెన్స్‌వేర్ బ్రాండ్, డిజైనర్ తరుణ్ తహిల్యాని క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై తమ ఉత్పత్తులను లిస్టింగ్ చేసే ప్రణాళికతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రముఖ బ్రాండ్లు తమ స్టోర్ల కోసం సరైన లొకేషన్‌ను గుర్తించడం, అమ్మకాల పరంగా విజయం సాధించడం క్లిష్టమైన టాస్క్ అనడంలో సందేహం లేదు. అదే క్విక్ కామర్స్ అయితే మరింత మంది వినియోగదారులకు వేగంగా, సులభంగా చేరుకోగలగడం వాటిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో నాసిక్, వారణాసి, ఉదయ్‌పూర్, హరిద్వార్, బటిండ తదితర చిన్న పట్టణాలకూ క్విక్‌కామర్స్ సేవలు విస్తరించడం గమనార్హం. స్పందన చూద్దాం.. క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో దీర్ఘకాల ఒప్పందాలకంటే, ముందు ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రముఖ బ్రాండ్లు ఆసక్తి చూపుతున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రస్తుతం బ్రాండ్లకు ఇది ప్రయోగాత్మక దశ. ఆడిదాస్, ఫ్యాబ్ ఇండియా తదితర బ్రాండ్లకు భారీ అమ్మకాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి కేవలం అప్పారెల్ కంపెనీలు. ఈ ఉత్పత్తుల్లో వెనక్కి తిరిగి పంపడం ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ కొనుగోళ్లలో 25–30 శాతం వెనక్కి వస్తుంటాయి. కనుక వీటి విషయంలో విజయం ఎంతన్నది వేచి చూస్తే కానీ తెలియదు. అదే గ్రోసరీ, స్టాపుల్స్, సౌందర్య ఉత్పత్తులు, బహుమతులు, మొబైల్ ఉత్పత్తులు క్విక్ కామర్స్‌పై ఎక్కువ డిమాండ్ ఉన్న విభాగాలు’’అని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తురాణి వివరించారు.సంప్రదాయ స్టోర్లపై ప్రభావం..క్విక్‌కామర్స్ శరవేగంగా విస్తరిస్తుండడం సంఘటిత స్టోర్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. సెపె్టంబర్ త్రైమాసికం డీమార్ట్ ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫలితాల తర్వాత స్టాక్ కూడా భారీగా పడిపోవడం గమనార్హం. పెద్ద మెట్రోల్లో క్విక్ కామర్స్ సంస్థల రూపంలో డీమార్ట్ వంటి స్టోర్లకు పోటీ తీవ్రంగా ఉన్నట్టు బ్రోకరేజీ సంస్థలు తమ విశ్లేషణలో పేర్కొన్నాయి. క్విక్ కామర్స్ కంపెనీలు తొలుత తక్షణ గ్రోసరీ డెలివరీ సేవలతో వ్యాపారం మొదలు పెట్టగా, కస్టమర్ల స్పందన ఆధారంగా తర్వాతి కాలంలో మరిన్ని విభాగాల్లోకి సేవలను విస్తరించాయి. గృహోపకరణాలు, చార్జింగ్ కేబుళ్లు, ఎయిర్‌కూలర్లు, ఐఫోన్లు, ఆట»ొమ్మలు ఇలా ఎన్నో ఉత్పత్తులను జోడించుకుంటూ వెళుతున్నాయి. ఇది సంప్రదాయ రిటైల్ పరిశ్రమను దెబ్బతీస్తుందని, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలు వర్తకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
చిన్న నగరాల్లో 2,500 ఐటీ జాబ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటులో భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో 30 ఐటీ కంపెనీల సీఈఓలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన పలువురు ప్రవాస భారతీయ సీఈఓలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా సిద్దిపేట, నల్లగొండ, నిజామాబాద్ తదితర పట్టణాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటివల్ల ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ వెల్లడించారు. ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ వృద్ది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లను ప్రారంభించామని, త్వరలో సిద్దిపేట ఐటీ టవర్లోనూ కార్యకలాపాలు మొదలవుతాయని కేటీఆర్ తెలిపారు. నిజామాబాద్, నల్లగొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం వేర్వేరు దశల్లో ఉందని, ఆదిలాబాద్‌కు కూడా ఐటీ టవర్‌ను మంజూరు చేశామన్నారు. ఐటీ కార్యకలాపాల విస్తరణతో వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వృద్ధి జరుగుతోందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటు ద్వారా గ్రామీణ ఉపాధికి ఊతమివ్వాలని ప్రవాస భారతీయులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి వంటి చిన్న పట్టణాల నుంచి తక్కువ ఖర్చుతో ఐటీ కంపెనీలను నిర్వహించే వీలుందన్నారు. టెక్జన్ సీఈఓ లాక్స్ చేపూరి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఐటీ కంపెనీల సీఈఓలతో భేటీని సమన్వయం చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో ఐటీ హబ్‌లు విజయవంతంగా పనిచేయడం వెనుక లాక్స్ చేపూరి, వంశీరెడ్డి, కార్తీక్ పొలసాని కృషిని కేటీఆర్ అభినందించారు. ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. అంతరిక్ష, వైమానిక, రక్షణ రంగాల్లో ముందంజ అంతరిక్ష, వైమానిక, రక్షణ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని, టీఎస్ఐపాస్ నిబంధనల మేరకు కంపెనీలకు నిర్దేశిత వ్యవధిలో పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాషింగ్టన్ డీసీలో కేటీఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, అడ్వైజరీ సంస్థలతోపాటు స్టారప్లు చర్చల్లో పాల్గొన్నాయి. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో వైమానికి, రక్షణ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెరిగాయని, 2018, 2020, 2022లో ఏరోస్పేస్ కేటగిరీలో ఉత్తమ రా్రష్తంగా అవార్డులు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ కేటగిరీలో హైదరాబాద్‌కు నంబర్ వన్ ర్యాంకు వచి్చందన్నారు. తమ కార్యాలయంలో డిఫెన్స్, ఏరోస్పేస్ సభ్యులతో కేటీఆర్ చర్చలు నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు యూఎస్, ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్íÙప్ ఫోరమ్ తెలిపింది. -
టర్మ్ పాలసీల్లో పట్టణ ప్రజలు మెరుగు
న్యూఢిల్లీ: టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మెట్రోలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలు వివేకాన్ని ప్రదర్శిస్తున్నారు. జైపూర్, పాట్నా, పుణె తదితర పట్టణాల్లో ఎక్కువ మంది ప్రజలు అచ్చమైన బీమా ఉత్పత్తిగా పరిగణించే టర్మ్ ప్లాన్లను తీసుకుంటున్నట్టు మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ సర్వే’లో తెలిసింది. ఇక్కడ ఏజెంట్ల ద్వారా టర్మ్ ప్లాన్లను ఎక్కువ మంది తీసుకుంటుంటే, అదే సమయంలో ఆన్లైన్ చానళ్లపైనా గణనీయమైన సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో 3,500 మంది ప్రజల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. జీవిత బీమా ఉత్పత్తుల పట్ల విజ్ఞానం పట్టణ ప్రజల్లో 2019లో 39గా ఉంటే, అది తాజా సర్వేలో 57కు పెరిగింది. జీవిత బీమా ఉత్పత్తులను కలిగి ఉన్న వారిలోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. 73 శాతానికి చేరింది. టర్మ్ ఇన్సూరెన్స్ విలువను అర్థం చేసుకోవడం మొదలైందని, మరింత మందికి దీన్ని చేరువ చేసేందుకు జీవిత బీమా పరిశ్రమ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
Visakhapatnam: ఇన్ఫోసిస్ @ వైజాగ్!
ఐటీ హబ్‌గా విశాఖపట్నం వడివడిగా అడుగులు వేస్తోంది. వైజాగ్‌లో బీచ్ ఐటీని ప్రమోట్ చేస్తూ దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచుకున్న ఆలోచనలకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫిదా అయ్యింది. విశాఖ నుంచి తమ సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. సాక్షి, విశాఖపట్నం : దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)తో పాటు ఇన్ఫోసిస్, డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్‌తో పాటు ఇన్ఫోసిస్, ఐబీఎం, హెచ్‌సీఎల్ మొదలైన ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. సముద్రం వ్యూ కనిపించేలా.. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేస్తే అద్భుత ఫలితాలు రాబట్టుకునేలా వైజాగ్ బీచ్–ఐటీ కాన్సెప్ట్ గురించి ఏపీ పెవిలియన్‌లో ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో తమ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. టైర్–2 సిటీల్లో వైజాగ్ ది బెస్ట్ ఇటీవల కాలంలో ఐటీ రంగంలోకి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి చాలా మంది రిక్రూట్ అయ్యారు. టాలెంట్ పూల్‌కి దగ్గరగా.. ప్రతిభను ఆకర్షించేలా టైర్–2 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీతో పాటు బీచ్ ఐటీని ప్రమోట్ చేయడంతో.. త్వరితగతిన వైజాగ్‌లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో ఉన్న ద్వితీయ శ్రేణి నగరాల్లో అన్ని వసతులు, వనరులున్న విశాఖ ది బెస్ట్ సిటీగా ఉండటంతో.. ప్రముఖ సంస్థలు ఇటువైపుగా తమ కార్యకలాపాలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్నాయి. చదవండి: (ఎంఎస్ఎంఈలతో భారీ ఉపాధి) సెప్టెంబర్‌లోగా విస్తరణ ఇన్ఫోసిస్ విశాఖలో కార్యాలయాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రారంభించాలని భావిస్తోంది. కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తే.. దాదాపు 1000 మందికి ఉద్యోగావకాశాలు కలిగే సూచనలున్నాయి. వైజాగ్ వంటి టైర్–2 నగరాలు భవిష్యత్‌లోను ప్రతిభకు కేంద్రాలుగా ఉంటాయని, అందుకే అక్కడ తాము పెట్టుబడులను కొనసాగిస్తున్నామని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఆలోచనలు చేస్తున్నామని సంస్థ హ్యూమన్ రిసోర్సస్ డెవలప్మెంట్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ ప్రకటించారు. -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఎయిర్‌లైన్స్‌లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్‌తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్‌కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్‌దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్‌లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్‌లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
చిన్న నగరాలకు రిటైల్ బ్రాండ్ల క్యూ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. పండ్లు, కూరగాయలు, గ్రాసరీ ఏ నిత్యావసరాలైనా సరే నాణ్యమైనవే ఎంచుకుంటున్నారు. ఇదే బహుళ జాతి రిటైల్ కంపెనీలకు వ్యాపార అవకాశంగా మారింది. ఇప్పటివరకు చిన్న పట్టణాలలో నాణ్యమైన రిటైల్ కేంద్రాలు లేకపోవటం కార్పొరేట్ బ్రాండ్లకు కలిసొచ్చింది. ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాలలో పెద్ద కార్పొరేట్ చెయిన్స్, రిటైల్ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే మధ్యకాలంలో ప్రముఖ రిటైల్ బ్రాండ్స్ 120కి పైగా లీజు లావాదేవీలను నిర్వహించాయి. 400 చ.అ. నుంచి 35 వేల చదరపు అడుగులు విస్తీర్ణాలలో ఎఫ్అండ్బీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్‌ను ఏర్పాటు చేశాయి. బిబా, రిలయన్స్ ట్రెండ్స్, ప్యాంటలూన్స్, లెన్స్‌కార్ట్, వెస్ట్‌సైడ్, జుడియో, మ్యాక్స్ వంటి అపెరల్స్, లైఫ్ స్టయిల్ బ్రాండ్స్, స్టార్‌బక్స్, పిజ్జా హట్, కేఎఫ్‌సీ వంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ (క్యూఎస్ఆర్), క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైలర్లు హైస్ట్రీట్‌లో స్టోర్లను ఏర్పాటు చేశాయి. మోర్ రిటైల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ఫైజాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్, ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో స్టోర్ల ఏర్పాటు కోసం 14–30 వేల చ.అ. స్థలాలను లీజుకు తీసుకుంది. తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లో సూపర్ మార్కెట్లు.. కార్పొరేట్ రిటైలర్లు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, గుర్గావ్ ప్రధాన నగరాలతో పాటు లక్నో, అహ్మదాబాద్, చంఢీఘర్, పాటియాలా వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్ వంటి చిన్న పట్టణాలల్లోనూ విస్తరిస్తున్నాయి. హైపర్, సూపర్ మార్కెట్ బ్రాండ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో శ్రేణి పట్టణాల్లోని హైస్ట్రీట్‌లో స్థలాలను లీజుకు తీసుకుంటున్నాయి. హైస్ట్రీట్ లీజు లావాదేవీలలో 23 శాతం వాటాతో అపెరల్ బ్రాండ్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఈ తర్వాత 15 శాతం వాటాతో ఎఫ్అండ్బీ బ్రాండ్లు, 12 శాతంతో జువెల్లరీ బ్రాండ్లు నిలిచాయి. పట్టణాల్లో ఎందుకంటే.. ఇప్పటికే హైస్ట్రీట్లలో వినియోగదారులు రద్దీ గణనీయంగా ఉంది. ఇలాంటి చోట్ల రిటైలర్లు విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. తక్కువ సమయం, వ్యయంతో తక్షణమే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే వీలుండటం రిటైలర్లు కలిసొస్తుందని అనరాక్ రిటైల్ జాయింట్ ఎండీ అండ్ సీఓఓ పంకజ్ రెంజెన్ తెలిపారు. మెట్రో నగరాలలో కొంతమంది రిటైలర్లు ఖరీదైన హైస్ట్రీట్లలో విస్తరణకు బదులుగా మంచి కనెక్టివిటీ, రోడ్ ఫేసింగ్ సైట్లలో విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా టైర్–2, 3 పట్టణాలు బ్రాండ్లకు అధిక ఆదాయ వనరులను అందిస్తున్నాయి. నిధులు, మూలధన పెట్టుబడులున్న రిటైలర్లు పోటీతత్వ ప్రయోజనాన్ని పొందేందుకు, మార్కెట్ వాటాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. చదవండి: 2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు -
రూ.2,999కే స్పైస్‌జెట్ టికెట్
ముంబై: విమాన ప్రయాణికులపై ఆఫర్ల వర్షం జోరుగా కురుస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే చౌక ధరల యుద్ధానికి తెర తీసిన స్పైస్‌జెట్ తాజాగా మరో ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ రూట్లలో ఒక వైపు జర్నీకి అన్ని పన్నులు కలుపుకొని చౌక ధరలకే విమాన టికెట్లనందిస్తున్నామని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ ఆవ్లి చెప్పారు. ఈ టికెట్ల ధరలు రూ.2,999(అన్ని పన్నలు కలుపుకొని) నుంచే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ ఆఫర్లో బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, మరో రెండు రోజులే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. వచ్చే నెల 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. వయా, ఆన్‌వార్డ్ కనెక్షన్ ఫ్లైట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. టైర్-టూ నగరాల నుంచి ఎయిర్‌ట్రాఫిక్‌ను పెంచడమే ఈ ఆఫర్ వెనక ఉద్దేశమని కానేశ్వరన్ పేర్కొన్నారు. 10 నిమిషాల్లో అమ్ముడైన ఎయిర్ ఏషియా టికెట్లు చెన్నై: ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమాన సర్వీస్‌కు సంబంధించిన టికెట్లు 10 నిమిషాల్లోపే అమ్ముడయ్యాయి. తమ తొలి విమాన సర్వీస్‌ను ఈ నెల 12న బెంగళూరు నుంచి గోవాకు నడపనున్నామని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య మంగళవారం తెలిపారు. ఈ టికెట్లు పది నిమిషాల్లోపే అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. 25 వేల ప్రొమో సీట్లను బుకింగ్స్ ప్రారంభించిన 48 గంటల్లో విక్రయించామని పేర్కొన్నారు. కాగా తొలి విమాన సర్వీస్‌కు సంబంధించిన చార్జీని రూ. 990(అన్ని పన్నులు కలుపుకొని)గా ఎయిర్ ఏషియా నిర్ణయించింది.