Tata AIA
-
తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ .. తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో 9 శాఖలు ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2,000 మంది పైచిలుకు అడ్వైజర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు 1,400 మంది చేరారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టాటా ఏఐఏ లైఫ్ శాఖల సంఖ్య 22కి చేరగా, అడ్వైజర్ల సంఖ్య 4,400 పైచిలుకు పెరిగింది. కంపెనీ ఎండీ, సీఈవో నవీన్ తహ్లియానీ మీడియా సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు సుమారు 314 శాఖలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో 12, తెలంగాణలో 10 ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీల ద్వారా వచ్చే కొత్త ప్రీమియం వసూళ్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 8%గా నమోదైందని, అన్ని మాధ్యమాల ద్వారా వచ్చిన కొత్త ప్రీమియం వ్యాపారంలో ఇది 5.5%గా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ.54,000 కోట్లుగా ఉంటాయన్నారు. 30–40 శాతం వృద్ధి అంచనా.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం సుమారు 30% పెరిగి రూ. 11,105 కోట్లకు చేరిందని నవీన్ చెప్పారు. తమ కంపెనీపరంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా 30–40% వృద్ధి అంచనా వేస్తున్నామని, పరిశ్రమ సగటు 20% స్థాయిలో ఉండవచ్చన్నారు. సుమారు రూ. 488 కోట్లు సమీకరించేందుకు నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అనుమతి లభించిందని, త్వరలో ఈ నిధులను సమీకరించనున్నామని నవీన్ పేర్కొన్నారు. కోవిడ్ క్లెయిమ్లు పెరుగుతున్న నేపథ్యంలో రీఇన్సూరెన్స్ సంస్థలు కూడా రేట్లు పెంచే యోచనలో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల పాలసీదారులపై భారం పడకుండా ఉండేలా చూసేందుకు వాటితో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. -
‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్టు ప్రకటించింది. బహుళ సంత్స రాల బ్రాండ్ భాగస్వామ్యంగా దీన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. (చదవండి: IND VS ENG: ఇంగ్లండ్లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే) -
టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ
ఏపీ, తెలంగాణల్లో ప్రయోగాత్మకంగా ఎం – ఇన్సూరెన్స్ సర్వీసులు ముంబై: ఎం–ఇన్సూరెన్స్ సేవలు అందించేందుకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్) చేతులు కలిపాయి. ఈ ఒప్పందం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు రూ. 1,00,000 దాకా జీవిత బీమా కవరేజీ అందించనున్నాయి. నిర్దిష్ట రీచార్జ్లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టాటా టెలీ ప్రీపెయిడ్ యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఎం–ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నట్లు టాటా ఏఐఏ లైఫ్ తెలిపింది. అన్ని వర్గాలకు బీమా ప్రయోజనాలు అందుబాటులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ చైర్మన్ ఇషాత్ హుసేన్ తెలిపారు.