టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ | Tata AIA Life Insurance Company with M-Insurance company | Sakshi
Sakshi News home page

టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ

Mar 28 2017 1:38 AM | Updated on Sep 5 2017 7:14 AM

టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ

టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ

ఎం–ఇన్సూరెన్స్‌ సేవలు అందించేందుకు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్, టాటా టెలీసర్వీసెస్‌ (టీటీఎస్‌ఎల్‌) చేతులు కలిపాయి.

ఏపీ, తెలంగాణల్లో ప్రయోగాత్మకంగా
ఎం – ఇన్సూరెన్స్‌ సర్వీసులు

ముంబై: ఎం–ఇన్సూరెన్స్‌ సేవలు అందించేందుకు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్, టాటా టెలీసర్వీసెస్‌ (టీటీఎస్‌ఎల్‌) చేతులు కలిపాయి. ఈ ఒప్పందం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు రూ. 1,00,000 దాకా జీవిత బీమా కవరేజీ అందించనున్నాయి. నిర్దిష్ట రీచార్జ్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని టాటా టెలీ ప్రీపెయిడ్‌ యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఎం–ఇన్సూరెన్స్‌ పాలసీ అందించనున్నట్లు టాటా ఏఐఏ లైఫ్‌ తెలిపింది. అన్ని వర్గాలకు బీమా ప్రయోజనాలు అందుబాటులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ చైర్మన్‌ ఇషాత్‌ హుసేన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement