ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. కోట్ల మంది యూజర్లు గూగుల్ యాజమాన్యంలోని ఓఎస్ మీద ఆధారపడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో వంటి చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అమలు చేస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం భారీగా పెరగడంతో బ్యాంకింగ్, లొకేషన్ వంటి ఇతర సమాచారాల కోసం దీని మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి గూగుల్ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ యూజర్లు ఓఎస్‌ను అప్డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. అప్డేట్ చేయకుండా ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్ 12, 12ఎల్, 13, 14 యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో అనేక లోపాలున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఓఎస్ అప్డేట్ చేయకపోవడం వల్ల మోసగాళ్ళు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుంది
CERT-In ప్రకారం.. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్స్, యూనిసో కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌లలో లోపాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకుండా మీ సమాచారం మొత్తాన్ని ఇతరులు హ్యాక్ చేసి తెలుసుకోగలరు.
Comments
Please login to add a commentAdd a comment