train ticket reservations
-
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే?
ఆన్లైన్ ట్రైన్ బుకింగ్ సంస్థ ట్రైన్‌మ్యాన్ (స్టార్క్ ఎంటర్ప్రైజెస్ ప్రై.లిమిటెడ్)ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఈ స్టార్టప్‌ను దక్కించున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు అదానీ గ్రూప్ సొంతం చేసుకున్న ట్రైన్ మ్యాన్ పోటీగా రానుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌లపై ఐఆర్సీటీసీ స్పందించింది. यह भ्रामक कथन है। Trainman IRCTC के 32 अधिकृत बी2सी (बिजनेस टू कस्टमर) भागीदारों में से एक है। हिस्सेदारी बदलने से इसमे कोई अंतर नहीं आयेगा। सभी एकीकरण और संचालन IRCTC के माध्यम से किए जाते रहेंगे। यह केवल IRCTC का पूरक होगा और IRCTC के लिए कोई खतरा या चुनौती नहीं है। https://t.co/7ERSbMj6JR — IRCTC (@IRCTCofficial) June 18, 2023 ఐఆర్సీటీసీ గుర్తింపు పొందిన బిజినెస్ టూ కస్టమర్ సర్వీసులు (బీ2సీ) అందించే 32 సంస్థల్లో ట్రైన్ మ్యాన్ ఒకటి. 0.13 శాతం మాత్రమే ప్రయాణికులకు ట్రైన్ టికెట్ల రిజర్వేషన్‌తో పాటు ఇతర సర్వీసులు అందిస్తుంది. కానీ, ఇండియన్ రైల్వేస్‌లో రోజుకు 14.5లక్షల రిజర్వేషన్ టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. వాటిలో 81శాతం ఇ-టికెట్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. Will Adani compete with IRCTC? No. IRCTC is a 100% monopoly in railway ticketing. Whether you book tickets from IRCTC or from aggregators like Paytm, MakeMyTrip or now Adani acquired Trainman, IRCTC makes money. It earned Rs 70 crore via Paytm in FY 2022, @ Rs 12 per ticket. 1/ pic.twitter.com/pwOOzxQ6Ud — ICICIdirect (@ICICI_Direct) June 19, 2023 ప్రస్తుతం, ఐఆర్సీటీసీకి ట్రైన్ మ్యాన్ పోటీ అంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అదానీ గ్రూప్.. ట్రైన్ మ్యాన్‌ను కొనుగోలు చేయడం వల్ల కార్యకలాపాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఐఆర్సీటీసీ సేవలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఐఆర్సీటీసీకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. కాగా, అదానీ గ్రూప్ మొదట ఐఆర్సీటీసీతో పోటీ పడుతుందని, తరువాత స్వాధీనం చేసుకుంటుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన ఆరోపణల్ని సైతం ఐఆర్సీటీసీ కొట్టిపారేసింది. చదవండి👉 స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’! -
విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ఫుల్ డిమాండ్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): బెంగళూరు రైలు ప్రయాణం విశాఖ వాసులకు గగనంగా మారింది. ఫుల్ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి అయినా.. బెంగళూరుకు విశాఖ నుంచి నేరుగా ఒక్క రైలు కూడా లేదు. అన్నీ ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లేవే. వాటిలో విశాఖ కోటా చాలా తక్కువ. గతంలో విశాఖపట్నం నుంచి నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌కు మళ్లించేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, బెంగళూరుకు ప్రత్యేక రైలు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారే లేకపోయారు. రిజర్వేషన్ కష్టమే.. విశాఖపట్నం మీదుగా బెంగళూరుకు ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా అన్ని ఫుల్‌గానే నడుస్తాయి. ప్రస్తుతం విశాఖపట్నం మీదుగా ప్రశాంతి, హౌరా –యశ్వంత్‌పూర్ వంటి రెగ్యులర్ రైళ్లతో పాటు, ముజఫర్‌పూర్–యశ్వంత్‌పూర్(మంగళ), గౌహతి–శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్ బెంగళూరు(ఎస్ఎంవీటీ) (సోమ, మంగళ, బుధ), హౌరా–ఎస్ఎంవీటీ (హమ్‌సఫర్)(మంగళ), హతియా–ఎస్ఎంవీటీ (సోమ, బుధ) భువనేశ్వర్–కృష్ణరాజపురం(హమ్‌సఫర్)(బుధ), డిబ్రూఘడ్–ఎస్ఎంవీటీ స్పెషల్ (గురు), భాగల్పూర్–ఎస్ఎంవీటీ (బుధ), టాటా–యశ్వంత్‌పూర్(శుక్ర), పూరీ–యశ్వంత్‌పూర్ (గరీబ్‌రధ్)(శుక్ర), హౌరా–మైసూరు(శని), టాటా–యశ్వంత్‌పూర్(శని). ప్రతీ ఆదివారాలలో హతియా–ఎస్ఎంవీటీ(ఆది), భువనేశ్వర్–బెంగళూరు కంటోన్మెంట్(ఆది), న్యూ టిన్సుకియా–బెంగళూరు(సోమ), అగర్తలా–ఎస్ఎంవీటీ(హమ్‌సఫర్) (సోమ) వంటీ వీక్లీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ ఈ రైళ్లలో ఎప్పుడూ రిజర్వేషన్ దొరకదు. ఈ ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్ కావాలంటే కనీసం రెండు, మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నగరవాసులు ఎక్కువశాతం బెంగళూరు వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరు తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రైళ్లలో వీరికి రిజర్వేషన్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీక్లీ ఎక్స్‌ప్రెస్.. మరో రెండు ఆదివారాలే.. ప్రస్తుత డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యేక కృషితో విశాఖపట్నం నుంచి బెంగళూరుకు డైరెక్ట్‌గా వీక్లీ స్పెషల్ రైలును తాత్కాలికంగా రెండు నెలలు నడిపేందుకు అనుమతి వచ్చింది. ఈ విషయం జూలై 22న ప్రకటించగా వెంటనే ఈ రైల్లోని సీట్లు అన్ని దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ రైలు 6 ట్రిప్పులు నడవగా ప్రతీ సారి సీట్లు, బెర్తులు ఫుల్ అయ్యి, పూర్తి ఆక్యుపెన్సీతో ఈ రైలు నడిచింది. ఇంకా మిగిలి ఉన్న రెండు ట్రిప్పులలో అంటే సెప్టెంబరు 18, 25తేదీల్లోనూ స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ 64, 08 ఉంది, ఇక ఏసీలో 25, 2 ఉంది. కోచ్‌లు పెంచినా తరగని జాబితా.. ఈ రైలు ఆక్యుపెన్సీ దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఒక స్లీపర్‌క్లాస్, ఒక థర్డ్ ఏసీ కోచ్‌లను అదనంగా జత చేశారు. అయినా వెయిటింగ్ లిస్ట్ జాబితా తరగడం లేదు. గత ఆదివారం (సెప్టెంబరు 11వ తేదీన) రిజర్వేషన్లు దొరక్క స్లీపర్‌లో దాదాపు 43 మంది, ఏసీలో 15 మంది టికెట్లు రద్దు చేసుకున్నట్లు సమాచారం. అదనంగా పెంచిన కోచ్‌లతో ఈ రైల్లో మొత్తం స్లీపర్ క్లాస్ 720, థర్డ్ ఏసీ–370, సెకండ్ ఏసీ–46 బెర్తులు, సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా విశాఖపట్నం నుంచే ప్రతీసారి నూరు శాతం ఆక్యుపెన్సీతో బయల్దేరుతుంది. ఇంత డిమాండ్ ఉన్న ఈ మార్గంలో నడిచే ఈ వీక్లీ స్పెషల్‌ను డైలీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై ఇటీవల విలేకరుల సమావేశంలో డీఆర్ఎం మాట్లాడుతూ డిమాండ్ ఉన్న రూట్లలో రైళ్లు నడిపేందుకు, అవసరమైనప్పుడు అదనపు కోచ్‌లను జత చేసేందుకు వాల్తేర్ డివిజన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన కృషి ఫలించి, విశాఖ వాసుల ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. (క్లిక్: నయా ‘ఆన్లైన్’ మోసం.. ఆర్డర్ ఇవ్వకపోయినా ఇంటికి కొరియర్) -
రీఫండ్‌కు రెడ్ సిగ్నల్, ఇదేందంటూ ప్రయాణికుల విస్మయం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కాలంలో నడిపిన ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లుగా మార్చిన రైల్వే అదనపు చార్జీలు తిరిగి చెల్లించడంపై మాత్రం చేతులెత్తేసింది. ప్రత్యేక చార్జీలపై అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి అదనపు సొమ్మును తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు మరో రెండు, మూడు నెలల పాటు రెగ్యులర్ రైళ్లలో సైతం ప్రత్యేక చార్జీలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్‌లకు కూడా రెగ్యులర్ చార్జీలను వర్తింపజేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా టికెట్ చార్జీలు పెంచినప్పుడల్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రయాణికులపై కూడా వీటి పెంపు భారాన్ని విధించే అధికారులు.. చార్జీలను తగ్గించినప్పుడు మాత్రం ఆ మేరకు రీఫండ్ చేయకపోవడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లపై అన్యాయం.. ♦ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణానికి 120 రోజుల ముందే రిజర్వేషన్లు బుక్ చేసుకొనే సదుపాయం ఉంది. అంటే కనీసం మూడు నెలల ముందుగానే రిజర్వేషన్ సదుపాయాన్ని పొందవచ్చు. ♦ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల స్థానంలో అందుబాటులోకి వచ్చిన అన్ని రెగ్యులర్ రైళ్లలో వచ్చే సంక్రాంతి వరకు ప్రయాణాలు నమోదయ్యాయి. లక్షలాది మంది ఇందుకోసం 30శాతం అదనంగా చెల్లించారు. కానీ ఇప్పుడు అదనపు సొమ్ము మాత్రం వారికి తిరిగి చెల్లించడం లేదు. ♦సాధారణంగా చార్జీలు పెంచినప్పుడు పాత చార్జీలపై టికెట్ బుక్ చేసుకున్న వారి నుంచి ప్రయాణ సమయంలో పెంచినవాటిని రాబట్టుకుంటారు. ముందే చెల్లించిన ‘అదనపు’ చార్జీలు తిరిగి ఇవ్వడానికి మాత్రం నిరాకరించడం అన్యాయమని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదేం ‘ప్రత్యేకం’... ♦ కోవిడ్ దృష్ట్యా గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో అన్ని రైళ్లను రద్దు చేశారు. ఎంఎంటీఎస్‌తో పాటు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అత్యవర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య ‘రెగ్యులర్’ రైళ్లకే వాటి నంబర్లకు ప్రారంభంలో ‘సున్నా’ను చేర్చి ప్రత్యేక రైళ్లుగా నడిపారు. ♦ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు మొదట్లో 22 రైళ్లతో ప్రారంభించి దశలవారీగా సుమారు 150కిపైగా రెగ్యులర్ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రూట్లలో రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లకు సైతం ‘సున్నా’ను చేర్చి ‘స్పెషల్’గా నడిపారు. ♦ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై మరో 30 శాతం వరకు అదనంగా పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖకు సాధారణ థర్డ్ ఏసీ చార్జీలు సుమారు రూ.600 వరకు ఉంటే ప్రత్యేక రైళ్లలో ఇది రూ.700 వరకు పెరిగింది. ♦అన్ని రూట్లలోనూ చార్జీలు పెంచి నడిపారు. మరోవైపు దసరా, సంక్రాంతి వంటి పండగ రోజుల్లోనూ ప్రత్యేక దోపిడీ కొనసాగింది. కోవిడ్ కాలంలో పట్టాలెక్కించిన ఈ ‘ప్రత్యేక’ రైళ్లు ఇటీవల కాలం వరకు నడిచాయి. ♦ తాజాగా ఈ రైళ్లన్నింటినీ వాటి నంబర్లకు ప్రారంభంలో ఉన్న ‘సున్నా’ను తొలగించి పాత పద్ధతిలో, పాత నంబర్లతో పునరుద్ధరించారు. 30 శాతం అదనపు చార్జీలను రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లలో, పాత చార్జీలపై ప్రయాణం చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
ఇక రైల్వే టికెట్ బుకింగ్ మరింత ఈజీ
న్యూఢిల్లీ, సాక్షి: ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీకానుంది. ఇందుకు వీలుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. యాప్‌ను సైతం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పులన్నీ 2021 జనవరి 1 నుంచీ అమల్లోకిరానున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గురువారం అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లకు పచ్చజెండా ఊపారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను 6 కోట్లమందికిపైగా వినియోగిస్తున్నారు. రోజుకి సగటున 8 లక్షలకుపైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. రిజర్వ్డ్ టికెట్లలో 83 శాతం ఆన్లైన్ ద్వారానే బుక్ కావడం విశేషం! ఐఆర్సీటీసీ అందించిన వివరాల ప్రకారం.. చదవండి: (నెలకు రూ. 500లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్) - యూజర్లు లాగిన్ అయ్యాక టికెట్లతోపాటే భోజనం, వసతి గదుల(రిటైరింగ్ రూమ్స్) వంటివి బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. టికెట్ కోసం నింపిన యూజర్ల వివరాలతో ఒకే దఫాలో(వన్‌స్టాప్ సొల్యూషన్) వీటన్నిటినీ బుక్ చేసుకోవచ్చు. - బుకింగ్ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజర్ వెదుకుతున్న స్టేషన్లు లేదా ప్రయాణికుల వివరాలను వేగంగా అందిస్తుంది. - యూజర్ అకౌంట్స్ పేజీలో రిఫండ్ స్టేటస్‌ను అత్యంత సులభంగా పరిశీలించవచ్చు. గతంలో ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమయ్యేది. - రెగ్యులర్ లేదా ఫేవరెట్ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. - ట్రయిన్ సెర్చ్, సెలక్షన్‌కు సంబంధించి అన్ని వివరాలూ ఇకపై ఒకే పేజీలో కనిపించనున్నాయి. - వెదుకుతున్న రైళ్ల వివరాలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత, ధరలు వంటివి ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పేజీని స్ర్కోల్ చేయడం ద్వారా బుక్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రయిన్ వివరాలను మాత్రమే తెలుసుకునేందుకు వీలుండేది. - బ్యాకెండ్‌లో క్యాచ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో సీట్ల అందుబాటు సమాచారంలో మరింత వేగంగా లోడింగ్‌కు అవకాశముంటుంది. - వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి సీటు ఖరారయ్యే(కన్ఫర్మేషన్) అవకాశాలను సైతం సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్‌ను ప్రత్యేకంగా వెదకవలసి వచ్చేది. - ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు సైతం పేజీలో ప్రత్యక్షం కానున్నాయి. - టికెట్ బుకింగ్ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణ వివరాలు డిస్ప్లే కానున్నాయి. టైపింగ్ తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చాల వినియోగంతో సైబర్ సెక్యూరిటీకి వీలుంది. -
రైలు టికెట్‌తో పాటే షిర్డీ దర్శనం పాస్
సాక్షి, ముంబై: షిర్డీకి వచ్చే భక్తులు ఇకపై రైలు టికెట్ల రిజర్వేషన్‌తోపాటు దర్శనం పాస్ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 26వ తేదీ నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు షిర్డీ సాయిబాబా ట్రస్ట్ సంస్ట్ అధ్యక్షుడు తెలిపారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో షిర్డీ కోసం టికెట్ బుక్ చేసే సమయంలోనే అక్కడ షిర్డీ సాయి సంస్థాన్‌కు చెందిన ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్.సాయి.ఆర్గ్.ఇన్ అనే వెబ్ సైట్లింక్ కన్పిస్తుందన్నారు. దీని ద్వారా దర్శనం పాస్ తీసుకోవచ్చన్నారు. సాయినగర్ షిర్డీ, కోపర్గావ్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్ వంటి రైల్వేస్టేషన్ల కోసం టికెట్లు రిజర్వేషన్‌న్‌చేయించుకునే వారికి ఇది అందుబాటులో ఉంటుంది. -
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ఆఫర్
ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రయాణికులకు సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయం బుధవారం నుంచి డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే ఐ, ఈ-టిక్కెట్ ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.