Shirdi Sai Darshan
-
రైలు టికెట్‌తో పాటే షిర్డీ దర్శనం పాస్
సాక్షి, ముంబై: షిర్డీకి వచ్చే భక్తులు ఇకపై రైలు టికెట్ల రిజర్వేషన్‌తోపాటు దర్శనం పాస్ రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 26వ తేదీ నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు షిర్డీ సాయిబాబా ట్రస్ట్ సంస్ట్ అధ్యక్షుడు తెలిపారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో షిర్డీ కోసం టికెట్ బుక్ చేసే సమయంలోనే అక్కడ షిర్డీ సాయి సంస్థాన్‌కు చెందిన ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్.సాయి.ఆర్గ్.ఇన్ అనే వెబ్ సైట్లింక్ కన్పిస్తుందన్నారు. దీని ద్వారా దర్శనం పాస్ తీసుకోవచ్చన్నారు. సాయినగర్ షిర్డీ, కోపర్గావ్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్ వంటి రైల్వేస్టేషన్ల కోసం టికెట్లు రిజర్వేషన్‌న్‌చేయించుకునే వారికి ఇది అందుబాటులో ఉంటుంది. -
నాందేడ్ వద్ద రోడ్డు ప్రమాదం: గుంటూరువాసులు ఇద్దరు మృతి
గుంటూరు : మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరుజిల్లా నరసరావుపేటకు చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. మృతులను గోపాలరావు (68), రఘునాథ గుప్త (43)గా గుర్తించారు. వీరు గుంటూరు నుంచి షిర్డీ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
31న రోజంతా షిర్డీ సాయి దర్శనం
సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న బుధవారం రోజంతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ‘‘బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా బాబా దర్శనం ఉంటుంది. కేవలం ఆరతి సమయంలో 15 నిమిషాలపాటు క్యూను నిలుపుతారు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం షిర్డీలో విపరీతమైన చలి ఉంది. ఈ నేపథ్యంలో చలిని తట్టుకునేందుకు భక్తులకు అదనంగా చద్దర్లు, తివాచీలు సమకూర్చడంతో పాటు తాగునీరు, స్నానాల గదులు, మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, లడ్డు ప్రసాదం కోసం అదనంగా కూపన్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.