సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న బుధవారం రోజంతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ‘‘బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా బాబా దర్శనం ఉంటుంది.
కేవలం ఆరతి సమయంలో 15 నిమిషాలపాటు క్యూను నిలుపుతారు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం షిర్డీలో విపరీతమైన చలి ఉంది. ఈ నేపథ్యంలో చలిని తట్టుకునేందుకు భక్తులకు అదనంగా చద్దర్లు, తివాచీలు సమకూర్చడంతో పాటు తాగునీరు, స్నానాల గదులు, మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, లడ్డు ప్రసాదం కోసం అదనంగా కూపన్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
31న రోజంతా షిర్డీ సాయి దర్శనం
Published Fri, Dec 26 2014 7:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement