శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు అక్టోబర్2 నుంచి.. | advance booking for Sevas of Tirumala Tirupati devasthanam will begin from oct 2nd | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు అక్టోబర్2 నుంచి..

Published Tue, Sep 29 2015 8:04 PM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM

advance booking for Sevas of Tirumala Tirupati devasthanam will begin from oct 2nd

  • నవంబరు 16-30 మధ్య సేవా టికెట్ల బుకింగ్‌కు టీటీడీ అనుమతి
  • సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 12,904 టికెట్ల కోటాను అక్టోబరు 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. నవంబరు 16 నుంచి 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే సేవల కోసం భక్తులు ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు టీటీడీ అనుమతిచ్చింది. ఈ కోటా కింద అర్చన-50, తోమాల 50, సుప్రభాతం -1,741, అష్టదళపాద పద్మారాధన-40, విశేషపూజ-498, నిజపాద దర్శనం-580, కల్యాణోత్సవం-4,200, వసంతోత్సవం 2,160, ఆర్జిత బ్రహ్మోత్సవం-1,260, సహస్రదీపాలంకరణసేవ-1,625, ఊంజల్‌సేవ 700 టికెట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన భక్తులు www.ttdsevaonline.com టీటీడీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు. వన్‌టైమ్ పాస్‌వర్డ్ పద్ధతిలో ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement