ముంబైలోని ధారావిలో గల మురికివాడలో జరిగిన ఓ పండగకు హాజరయ్యారు సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా. ఆ పండగలో భాగంగా అక్కడి రెండు వందల మందితో కలిసి డ్యాన్స్ చేశారు. సల్మాన్ ఖాన్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న ‘సికందర్’కి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్త ఇది. కథలో భాగంగా ధారావిలో జరిగే పండగకి ఈ ఇద్దరూ వెళతారట. అప్పుడు వచ్చేపాటను చిత్రదర్శకుడు మురుగదాస్ భారీగా చిత్రీకరించారని సమాచారం. జోష్‌గా సాగే ఈపాటకు సల్మాన్, రష్మికా అదిరి΄ోయే లెవల్లో స్టెప్పులు వేశారట.
మురికివాడలకు సంబంధించిన సెట్‌ని ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేయించి, ఈపాటను చిత్రీకరించారని భోగట్టా. ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్ ‘సికందర్’ సెట్స్‌లో అడుగుపెట్టారు. ‘సికందర్ డే 1’ అంటూ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు కాజల్. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment