
'మోడీ అభిమానిని, ప్రచారం అవసరం లేదు'
బాలీవుడ్ నటి, ఐపిఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది.
వారణాసి : బాలీవుడ్ నటి, ఐపిఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. దర్శనం అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ తాను నరేంద్ర మోడీ అభిమానినంటూ, ఆయన విజయాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను దేవుని దర్శనానికి వచ్చానంటూ.... మోడీ గెలుపుకు ప్రచారం అవసరం లేదన్నారు.
ప్రజలు మోడీని అభిమానిస్తున్నారని ప్రీతి తెలిపింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యంగా మహిళలు, పేదలు ఓటు హక్కును వినియోగించుకుంటే అయిదేళ్ల పాటు సక్రమ పాలనకు దోహదం చేసిన వారవుతారని ఆమె పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా తనకు ఇష్టమేనని ప్రీతి తెలిపింది. కాగా అంతకు ముందు రోజు ప్రీతి తన వారణాసి ప్రయాణం, నగరంతో ఉన్న అనుబంధాన్ని ట్విట్ట్ చేసింది.
నరేంద్ర మోడీ, ప్రీతి జింటా, వారణాసి, బీజేపీ, narendra modi, Preity Zinta, varanasi, bjp