
దొంగ భలే బుక్కయ్యాడని కొందరు.. సీన్ రివర్సయిందంటూ మరికొందరు నటి ఫాలోయర్లు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీలలో నటి ప్రీతి జింతా ఒకరు. ఆమె షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది. గతంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చూసినా.. నటి ప్రీతి జింతా ఓ సందేశాన్ని అందిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. బైక్ ట్రబుల్ ఇవ్వడంతో చెక్ చేస్తున్న వ్యక్తి ప్యాంటు వెనుక జేబులోంచి పర్సును ఓ దొంగ తీశాడు. ఆపై ఏం జరిగిందో ప్రీతి జింతా చెబుతూ.. పైవాడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త అని, మైండ్ బ్లోయింగ్, కాట్ ఆన్ కెమెరా అనే హ్యాష్‌ట్యాగ్స్ జతచేసి పోస్ట్ చేయగా ఆమె ఫాలోయర్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దొంగ భలే బుక్కయ్యాడని కొందరు.. సీన్ రివర్సయిందంటూ మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియో మీరు వీక్షించండి..
Are you kidding me ? This thief takes the cake 🤪 after all Uper wala dekh raha hai 😘😜👏 ऊपर वाला देख रहा है ! #mindblowing #caughtoncamera #thief #bachaao #ting #apology #Roadside pic.twitter.com/OeMSOYPAv1
— Preity G Zinta (@realpreityzinta) 15 July 2018