కనిపించే ఆట వెనుక కనిపించని ఆట.. ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’స్వార్థమే ఆ ఇన్‌సైడ్ గేమ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్!పంచ్‌లు ఉండవు. పవర్ ఉంటుంది. మాటలు ఉండవు. మనీ ఉంటుంది.ఎవరూ క్రిమినల్స్ కాదు.అలాగని ఎవరూ హీరోలు కాదు. చూడండి.. కళ్లు బైర్లు కమ్మే కుట్రలు కుహకాల ఐపీఎల్!
ఇన్‌సైడ్ ఎడ్జ్‌అమెజాన్ (ప్రైమ్ వీడియో) ఇండియా నెట్‌వర్క్‌ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్
ప్రొడ్యూసర్: ఫర్హాన్ అఖ్తర్
డైరెక్టర్: కరణ్ అన్షుమన్
విడుదల: జూలై 10, 2017
జరీనా మాలిక్, విక్రాంత్ ధవన్ పాత్రలు ప్రీతి జింతా, నెస్ వాడియాలను జ్ఞప్తికి తెస్తాయి. అరవింద్ వశిష్ట్, వాయు రాఘవన్, దేవేంద్ర మిశ్రా, కేజీ రఘునాథ్ రోల్స్.. ధోనీ, విరాట్ కొహ్లీ, శ్రీశాంత్ క్యారెక్టర్స్‌ను రిఫ్లెక్ట్ చేస్తాయి.
ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ముంబై మావరిక్స్, హరియాణా హరికేన్స్ తలపడ్తున్నాయి. ముంబై మావరిక్స్ బలమైన జట్టు..దేశంలో ఏ ఐపీఎల్ జట్టుతో పోల్చుకున్నా! కాని ఈ మ్యాచ్‌లో ముంబై మావరిక్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది హరియాణా హరికేన్స్. ఫస్ట్ బ్యాటింగ్ ఆ జట్టుదే. ఏ బంతినైనా బౌండరీ దాటించేస్తున్నారు బాట్స్‌మెన్. బాక్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ముంబై మావరిక్స్ ఓనర్స్ జరీనా మాలిక్ (రీచా చద్దా), విక్రాంత్ «ధవన్ (వివేక్ ఆనంద్ ఒబేరాయ్) మొహాల్లో ఆందోళనేమీ లేదు. క్యాచ్ మిస్ అయినప్పుడు ‘‘షిట్’’ అని, బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి వచ్చాక బాల్ వికెట్‌కి తగిలినప్పుడు ‘‘ప్చ్’’ అనే నిట్టూర్పులు తప్ప. ముంబై మావరిక్స్ పేలవమైన బౌలింగ్ మీద పెదవి విరిచేస్తున్నారు కామంటేటర్స్. గ్యాలరీలో ఉన్న మావరిక్స్ టీమ్ ఎనలిస్ట్ రోహిణీ రాఘవన్ (సయానీ గుప్తా) కలవర పడుతోంది. మాటిమాటికీ గ్రౌండ్‌లోకి వెళ్లి కెప్టెన్ వాయు రాఘవన్ (తనూజ్ విర్వాని)ని నిలదీస్తోంది.. ‘‘వాట్స్ గోయింగ్ ఆన్?’’అంటూ. యంగ్ బౌలర్, పందొమ్మిదేళ్ల ప్రశాంత్ కనౌజియా (సిద్ధాంత్ చతుర్వేది)నూ బెదిరిస్తోంది.. ‘‘ఎన్ని రన్స్ ఇస్తున్నావో అర్థమవుతోందా? ఏమైంది మీ అందరికీ?’ అంటూ. ఆమె ఆరాటం చూసి ఎద్దేవాగా నవ్వుతున్నాడు దేవేంద్ర మిశ్రా (అమిత్ సియాల్).
ఆఫ్టర్ ది బ్రేక్.. సెకండ్ ఇన్నింగ్స్..
ముంబై మావరిక్స్ బ్యాటింగ్‌కి దిగింది. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ వాయు రాఘవన్ వచ్చేవరకు పెద్దగా స్కోర్ కాలేదు. వాయు రాఘవన్ బాక్స్‌లో ఉన్న తమ ఓనర్ జరీనా మాలిక్‌ను చూశాడు. పెదవులు విడివడకుండా నవ్వింది ఆమె. పక్కనే ఉన్న విక్రాంత్‌ని కూడా చూశాడు రాఘవన్. వంకరగా నవ్వాడు విక్రాంత్. ఆడటం మొదలుపెట్టాడు. అంతకుముందు హరియాణా హరికేన్స్ గెలుపు మీద లక్షల్లో పందెం కాసిన విక్రాంత్ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు. ముంబై మావరిక్స్ ఓటమి మీద కోట్లకు పెంచాడు పందెం పైకాన్ని. గ్యాలరీలో రోహిణీకి అయోమయం. వాయు తప్ప నెమ్మదినెమ్మదిగా మిగిలిన బాట్స్‌మెన్ అవుటవుతున్నారు. రెండు బంతుల్లో ఫోర్ రన్స్ చేయాలి. ఒక బంతి పడనే పడింది. నో రన్. రోహిణీ శ్వాస ఆగినంత పనైంది. బౌలర్ వ్యూహం పన్నాడు. ఫీల్డర్స్ అంతా దగ్గరగా వచ్చారు. వాయు బ్యాట్ ఎత్తాడు. రోహిణీ ఎనాలిసిస్ స్టార్ట్ చేసింది. పడబోయేది ఏ బాల్? వాయు అవుటవనున్నాడా.. రన్ తీయనున్నాడా అని. బౌలర్ పరిగెడుతున్నాడు పిచ్ వైపు. బ్యాట్‌ను నేలకు టచ్ చేస్తూ బౌలర్ కదలికలను గమనిస్తున్నాడు వాయు. ఉత్కంఠతతో శ్వాసను బిగబట్టిన రోహిణీ మొహంలో నవ్వు.. ఆమె మాట.. వాయూ బ్యాట్ ఒకేసారి పలికాయి.. ఫోర్.....!రోహిణీ ఆనందం పట్టలేక పిచ్‌లోకి పరిగెత్తుకొచ్చింది. జరీనా చప్పట్లలో గెలుపు ధ్వనించింది. విక్రాంత్ మొహం వాడిపోయింది. బెట్ కాసిన కోట్లు గంగలో కలిశాయి. ఆయన్ని నమ్మి డబ్బులు పెట్టిన వాళ్ల దవడలు, పిడికిళ్లు బిగుసుకున్నాయి. ప్రశాంత్, హమిష్ మెక్‌కాల్ (ఎడ్వర్డ్ సన్నేబ్లిక్) హై ఫైవ్ ఇచ్చుకున్నారు. ‘‘దిస్ ఈజ్ మై టీమ్ మిస్టర్ «ధవన్’’ అంటూ చిరుదరహాసంతో వెళ్లిపోయింది జరీనా.
అప్పుడొచ్చొంది మిస్టరీ ఉమన్ (నటాషా సూరీ) విక్రాంత్ దగ్గరికి ‘‘నీ మీద భాయ్ చాలా కోపంగా ఉన్నాడు’’ అంటూ.
ఎట్ ది ఎండ్
జరీనా తనను మోసం చేసిందన్న కోపం, అవమానంతో విక్రాంత్ ..జరీనా ప్రాణంలా చూసుకునే కుక్కను చంపేస్తాడు. ఆమెనూ చంపబోతుంటే అప్పటిదాకా విక్రాంత్‌కి కుడిభుజంగా ఉన్న వ్యక్తి వచ్చి జరీనాను కాపాడ్తాడు. ముంబై మావరిక్స్ టీమ్ మెంబర్స్ సంతకాలు చేసిన బ్యాట్ తీసుకుంటుంది జరీనా.. విక్రాంత్‌ను కొట్టడానికి. ఇక్కడితో ఇన్‌సైడ్ ఎడ్జ్ ఫస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ సీజన్‌లో విక్రాంత్ ఎంట్రీ, ఎగ్జిట్ మధ్య ఏం జరిగింది?
అది తొమ్మిది ఎపిసోడ్ల కథ
మనీ, పవర్, సెక్స్, అండర్ వరల్డ్ మాఫియా.. బిహైండ్ బౌండరీగా ఉన్న ఐపీఎల్ ప్లేని కళ్లకు కడ్తుంది ‘‘ఇన్‌సైడ్ ఎడ్జ్’’. కాని ఒక డిస్క›్లయిమర్.. కుటుంబమంతా కూర్చోని చూడదగ్గది కాదు. క్రికెట్ ఆట కన్నా ఒక వ్యాపారం. రాజకీయం కూడా. ఐపీఎల్ ట్రెండ్ క్రీజ్‌లోకి రాగానే ఆ సంస్కృతిని విస్తృతపరిచింది. ఐపీఎల్ మీద పెట్టుబడి పెట్టి.. క్రీడాకారుల గ్లామర్‌ను ఇంకో గ్రాఫ్‌కి మళ్లించింది. గెలిచినా డబ్బే. ఓడినా డబ్బే! బెట్టింగ్‌లు, అమ్మాయిలు, పార్టీలు.. ఫేమ్ కన్నా ఎక్కువ కిక్‌నిస్తాయనే క్యాచ్ విసిరింది. పట్టుకున్నవాడు పడిపోతాడు.మిస్ చేసినవాడు బాధ పడ్తాడు. వల అని తెలుసుకున్నవాడు అసల్లేకుండా పోతాడు. ఆటే ముఖ్యమని నమ్మినవాడు జట్టుకే దూరమవుతాడు. ఇదే ఇన్‌సైడ్ ఎడ్జ్ బాటమ్ లైన్.
డిటైల్డ్‌గా..
హీరోయిన్‌గా అవకాశాలు అడుగంటుతున్న సమయంలో ఐపీఎల్ పగ్గాలు పట్టుకుంటుంది జరీనా మాలిక్. ముంబై మావరిక్స్‌కి కో ఓనర్‌గా. ప్రతి మ్యాచ్‌లో గ్యాలరీ నుంచి టీమ్‌ను ఉత్సాహపరుస్తుంటుంది. కెప్టెన్ అరవింద్ వశిష్ట్ (అంగద్ బేడీ). నిజాయితీ గల డిపెండబుల్ కెప్టెన్. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా ఆ ప్రభావం తన ఆట మీద, కెప్టెన్సీ పైనా పడనివ్వకుండా టీమ్ విజయం కోసం పాటుపడ్తుంటాడు. బెట్టింగ్స్‌కి లొంగక, తన యజమానికి వ్యతిరేకంగామారి చివరకు జట్టు నుంచి ఉద్వాసనకు గురవుతాడు. కోచ్.. నిరంజన్ సూరి (సంజయ్ సూరి) ఒకప్పటి ఏస్ ప్లేయర్. ఎప్పుడో ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఆడుతున్నప్పుడు పడ్డ కక్కుర్తికి తర్వాత ఐపీఎల్‌లో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. విక్రాంత్ ధవన్.. వరల్డ్స్ లీడింగ్ స్పోర్ట్స్‌మేనేజ్‌మెంట్‌కంపెనీకి యజమాని. ముంబై మావరిక్స్‌లోనూ పెట్టుబడి పెట్టి ఒక భాగస్వామిగా మారుతాడు. ఆయనతో ముందు అగ్రిమెంట్ చేసుకున్న జరీనా.. తర్వాత అతని ప్రవర్తనతో భీతిల్లి అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలనుకుంటుంది. అది గ్రహించిన విక్రాంత్ ఆమె చేతిలో ఉన్న అరకొరా సినిమా చాన్స్‌లనూ లాగేసి, ఫీల్డ్‌లో ఐసోలేట్ అయ్యేలా చేస్తానని భయపెట్టడమే కాక చిన్న ట్రయల్ కూడా వేస్తాడు. దాంతో అయిష్టంగానే అగ్రిమెంట్‌ను ఇంప్లిమెంట్ చేస్తుంది జరీనా. అండర్ వరల్డ్ డా¯Œ అండదండలతో ముంబై మావరిక్స్‌ను బెట్టింగ్ బరిలో పెడ్తాడు. డబ్బు యావ ఉన్న స్పిన ్నర్ దేవేంద్ర మిశ్రా (అమిత్ సియాల్)ను ఎరగా మారుస్తాడు. వికెట్ కీపర్ కేఆర్ రఘునాథ్ (మనూజ్ శర్మ) ను గ్రిప్‌లో పెడ్తాడు. నిరంజన్ సూరీకీ కబురు పంపిస్తాడు. అలాంటి పనులు చేయనని నిక్కచ్చిగా చెప్పిన సూరీకి గతంలో అతను చేసిన తప్పును గుర్తు చేస్తాడు. చేసేది లేక విక్రాంత్‌తో చేతులు కలపాల్సి వస్తుంది సూరీకి. తర్వాత రియల్ మావరిక్స్, పరుగుల చీతా.. అనే ట్రాక్ రికార్డ్... మోస్ట్ ఇండిసిప్లీన్డ్, ఉమనైజర్, అన్ పంక్చువల్ అనే ఆఫ్ పిచ్ రిమార్క్స్ ఉన్న వాయు రాఘవన్ మీదా దృష్టిపెడ్తాడు. కాని వాయు దారికి రాడు. వదిలేసి జట్టులో అందరికన్నా చిన్నవాడు, ఫాస్ట్ బౌలర్, గ్రామీణ యువకుడు అయిన ప్రశాంత్ కనౌజియాను లాగాలనుకుంటాడు. ఆ పని దేవేంద్ర మిశ్రాకు అప్పగిస్తాడు. అప్పటికే ప్రశాంత్‌ను కులం పేరుతో వెక్కిరిస్తూ, అర్బన్ లైఫ్ స్టయిల్ లేదని విపరీతంగా వేధిస్తుంటాడు దేవేంద్ర మిశ్రా. అసలే ఇంగ్లిష్ రాదని ఆత్మన్యూనతతో కుంగిపోతున్న ప్రశాంత్‌కు దేవేంద్ర మిశ్రా ర్యాగింగ్ నరకాన్ని తలపిస్తుంటుంది. ఇవన్నీపడలేక ఊరెళ్లిపోవాలని ప్రశాంత్ అనుకుంటున్నప్పుడే దేవేంద్ర మిశ్రా బెట్టింగ్ గురించి చెప్పి.. జరగబోయే మ్యాచ్‌లో సరిగా ఆడొద్దని వార్న్ చేస్తాడు. విన్న ప్రశాంత్ అవాక్కవుతాడు. అందులో కోచ్ సూరీ సర్ కూడా షామిల్ అయ్యాడని తెలిసి ఖంగు తింటాడు. మొత్తమ్మీద ఆ మ్యాచ్ ఓడిపోతారు. ఇవేవీ తెలియని జరీనా.. తన జట్టు ఓడినందుకు బాధపడుతుంది.
హరియాణా హరికేన్స్‌తో మ్యాచ్‌కంటే ముందు..
జట్టు ఓడిపోగానే కోచ్ సూరి అపరాధభావంతో కుమిలిపోతుంటాడు. ఏమైనా సరే ఇలాంటివి తన వల్ల కాదని చెప్పాలని విక్రాంత్ దగ్గరకు వెళ్తాడు. చెప్తాడు. అయినా బలవంతం చేస్తే మీడియా ముందు బయటపెట్టేస్తాననీ వార్నింగ్ ఇస్తాడు సూరి . అతని మాటను విన్నట్టే నటిస్తాడు. ఈ క్రమంలోనే జరీనా తన సినిమా ప్రివ్యూకి ముంబై మావరిక్స్‌ను పిలుస్తుంది. పార్టీ కూడా ఇస్తుంది. ఆ పార్టీకి కెప్టెన్ అరవింద్ రాడు. భార్యతో సమయం గడిపి, కాపురం నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండి. అదే విషయాన్ని ప్రివ్యూలో ఉన్న సూరీకి మెస్సేజ్ చేస్తాడు.. ‘‘అంతా బాగుంటుంది అన్నావ్.. ఏమీ బాగాలేదు. వస్తున్నాను.ఉండు’’ అని. కాసేపటికి సూరీ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడ విక్రాంత్ ఉంటాడు. మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడి సూరీని పై నుంచి కిందకు తోసి చంపేస్తాడు. అది కెప్టెన్ అరవింద్ మీదకు వచ్చేలా.. వాయు అందులో భాగస్వామేమో అన్నట్టుగా.. నేపథ్యాన్ని పన్నుతాడు విక్రాంత్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఈలోపే హరియాణా హరికేన్స్‌తో మ్యాచ్ ఉంటుంది. అప్పుడే రోహిణీ, కెప్టెన్ అరవింద్, జరీనాకు.. విక్రాంత్ ముంబై మావరిక్స్‌ను బెట్టింగ్‌కి తాకట్టు పెట్టాడని అర్థమవుతుంది. వాయూకి ఉన్న బ్యాడ్ రిమార్క్స్‌తో బ్లాక్ మెయిల్ చేసి వాయూని బెట్టింగ్‌కి ఒప్పిస్తాడు విక్రాంత్. విక్రాంత్‌ను భరించాల్సిన అవసరం లేదని జరీనాకు ఎదురుతిరుగుతాడు అరవింద్. తనకు సపోర్ట్‌గా హమిష్, ప్రశాంత్‌ను కలుపుకుంటాడు. జరీనా మెదడులో వేరే ప్లాన్ ఉంటుంది. అందులో భాగంగానే చివరి క్షణంలో అరవింద్ మీద అటాక్ జరిగి అతను హోటల్ గదిలోనే స్పృహతప్పి పడిపోతాడు. అరవింద్ స్థానంలో వాయు రాఘవన్ కెప్టెన్ అవుతాడు. అతని సారథ్యంలో ప్రశాంత్, హమీష్‌లు జట్టు ఓనర్ విక్రాంత్‌ను, జతగాడు దేవేంద్ర మిశ్రాను నమ్మించి మోసం చేస్తారు.. హరియాణా హరికేన్స్ మీద ముంబై మావరిక్స్ విజయ డంకా మోగిస్తారు. ఇదంతా జరీనా ప్లాన్! పవర్ ప్లే, బన్నీ, ఇన్నర్ సర్కిల్, రాంగ్ ఫూట్, అవే గేమ్, ఓపెనింగ్ బిడ్, ఫో, కారిడార్ ఆప్ అన్‌సర్టెనిటీ, హ్యామర్ ప్రైజ్, మాగ్జిమమ్.. పేర్లతో పది ఎపిసోడ్స్‌గా సాగుతుంది ఇన్‌సైడ్ ఎడ్జ్. అమేజాన్ ప్రైమ్‌లో ఉంది. చూడొచ్చు.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment