ప్రీతి జింటా వివాదంలో సాక్షిగా క్రికెటర్ కొడుకు! | Ness Wadia abused a cricketer's son during Preity incident | Sakshi
Sakshi News home page

ప్రీతి జింటా వివాదంలో సాక్షిగా క్రికెటర్ కొడుకు!

Jun 17 2014 4:57 PM | Updated on Sep 2 2017 8:57 AM

ప్రీతి జింటా వివాదంలో సాక్షిగా క్రికెటర్ కొడుకు!

ప్రీతి జింటా వివాదంలో సాక్షిగా క్రికెటర్ కొడుకు!

ప్రీతితో నెస్ వాడియా గొడవపడినప్పడు అక్కడే ఓ లెజండరీ క్రికెటర్ కొడుకు ఉన్నట్టు విచారణలో తేలింది.

మాజీ ప్రేమికులు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ భాగస్వాములు ప్రీతి జింటా, నెస్ వాడియాల  వివాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రీతితో నెస్ వాడియా గొడవపడినప్పడు అక్కడే ఓ లెజండరీ క్రికెటర్ కొడుకు ఉన్నట్టు విచారణలో తేలింది. ఆ సమయంలో రికార్డయిన సీసీటీవీ క్లిప్లను రెండింటిని సేకరించారు. మైనర్ అయిన ఆ అబ్బాయిని ఈ కేసులో సాక్షిగా చేర్చాలా వద్దా అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

మాజీ ప్రియుడు నెస్ వాడియా దూషించడంతో పాటు తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వాడియాకు సమన్లు జారీ చేసే ముందు పోలీసులు ప్రీతిని విచారించనున్నారు. ఈ సంఘటన జరిగినపుడు అక్కడే ఉన్న క్రికెటర్ కొడుకు జోక్యం చేసుకుని వాడియను వారించినట్టు పోలీసులు చెప్పారు. అయితే వాడియా ఆ అబ్బాయిపై కూడా చిందులేసినట్టు తెలిపారు. అయితే ఏ క్రికెటర్ కొడుకు, అతని పేరు ఏంటి అన్న వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే కేసులో అతన్ని సాక్షిగా చేర్చితే పేరు వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement