IPL 2023, PBKS Vs GT: గిల్‌ క్లీన్‌ బౌల్డ్‌.. ప్రీతీ జింటా రియాక్షన్‌ సూపర్‌! వీడియో వైరల్‌ | Preity Zinta's Reaction To Shubman Gill Wicket, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: గిల్‌ క్లీన్‌ బౌల్డ్‌.. ప్రీతీ జింటా రియాక్షన్‌ సూపర్‌! వీడియో వైరల్‌

Published Fri, Apr 14 2023 8:03 AM | Last Updated on Fri, Apr 14 2023 9:06 AM

 Preity Zintas Reaction To Shubman Gills Wicket During IPL 2023  - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌(67) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

కాగా గుజరాత్‌ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా.. ధావన్‌ సామ్‌ కర్రాన్‌ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి మిల్లర్‌ సింగిల్‌ తీసి గిల్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. అయితే కర్రాన్‌ వేసిన అద్భుత బంతికి గిల్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క సారిగా పంజాబ్‌ డగౌట్‌ మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముఖ్యంగా స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న పంజాబ్‌ సహ యాజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి.

గిల్‌ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్బాజ్ ఖాన్, సోనూ సూద్‌లతో కలిసి  సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి రెండు బంతులు తర్వాత తెవాటియా ఫోరు బాది పంజాబ్‌కు ఓటమి మిగిలించాడు. కాగా ప్రీతి జింటా రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2023: ఏంటి హార్దిక్‌.. ఎంత కెప్టెన్‌ అయితే? మరీ చెత్త బ్యాటింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement