Mohammed Shami-Preity Zinta Share-Laugh After GT Beat PBKS - Sakshi
Sakshi News home page

ప్రీతి జింటాతో షమీ ముచ్చట.. ఫోటో వైరల్‌

Published Fri, Apr 14 2023 7:42 PM | Last Updated on Fri, Apr 14 2023 8:27 PM

Mohammed Shami-Preity Zinta Share-Laugh After GT Beat PBKS Viral - Sakshi

Photo: IPL Twitter

పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింటాకు ఈ ఏడాదైనా తన కల నెరవేరుతుందేమో చూడాలి. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌గా ఐపీఎల్‌లో తమ ప్రస్థానం ఆరంభించి 2014లో ఫైనల్‌ మెట్టుపై బోల్తా పడింది. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ఫైనల్‌ మెట్టు ఎక్కలేదు.

ఇక కింగ్స్‌ పంజాబ్‌ అని పేరును మార్చుకున్న తర్వాత కూడా జట్టుకు కలిసిరావడం లేదు. అందుకే ఈసారి శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంచుకొని ఈ సీజన్‌లో రెండు వరుస విజయాలు నమోదు చేసింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి పాలైంది. గురువారం గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడింది.

ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్‌ ముగిశాకా ప్రీతి జింటా.. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీతో ముచ్చటించడం ఆసక్తిగా మారింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. వీరిద్దరు నవ్వుతున్న ఫోటోను కెమెరామన్‌ క్లిక్‌మనిపించాడు. గుజరాత్‌ టైటాన్స్‌ ఈ ఫోటోను షేర్‌ చేస్తూ పాత స్నేహితుడిని కలిసిన ఆనందం అనుకుంటా అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక మహ్మద్‌ షమీ 2019 నుంచి 2021 వరకు పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు పంజాబ్‌ కింగ్స్‌కు మెయిన్‌ బౌలర్‌గా వ్యవహరించాడు.

చదవండి: కేకేఆర్‌ వద్దన్నోడిని ఎస్‌ఆర్‌హెచ్‌ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement