ప్రీతీజింతా సోదరుడి ఆత్మహత్య | Preity Zinta’s cousin Nitin Chauhan commits suicide | Sakshi
Sakshi News home page

ప్రీతీజింతా సోదరుడి ఆత్మహత్య

Published Sat, Dec 3 2016 7:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ప్రీతీజింతా సోదరుడి ఆత్మహత్య

ప్రీతీజింతా సోదరుడి ఆత్మహత్య

సిమ్లా: టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్లో సెట్ అయిన ప్రీతీజింతా సోదరుడు నితిన్ చౌహాన్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రీతిజింతా కజిన్ సోదరుడైన నితిన్ చౌహాన్ గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే భార్య, అత్త, మామల వేధింపులు తాళలేక శుక్రవారం సిమ్లాలో తన కారులో గన్తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులకు నితిన్ కారులోనూ, ఇంట్లో నాలుగు పేజీల రెండు సూసైడ్ నోట్లు లభించాయి. అందులో భార్య, అత్త, మామల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి కన్నకొడుకుని కూడా చూడనివ్వలేదని సూసైడ్ నోట్లో నితిన్ తెలిపాడు. దీంతో భార్య, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే కోర్టులో దాఖలు చేసుకున్న విడాకుల కేసుకు సంబంధించి విచారణ శుక్రవారమే జరగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement