మూడేళ్ల తర్వాత సూపర్ హిట్! | Three years after the super hit! | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాత సూపర్ హిట్!

Published Mon, Mar 28 2016 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

మూడేళ్ల తర్వాత  సూపర్ హిట్!

మూడేళ్ల తర్వాత సూపర్ హిట్!

పెళ్లయ్యాక కథానాయికలు వెండితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి కొంత సమయం తీసుకుంటారు.

పెళ్లయ్యాక కథానాయికలు వెండితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ, ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ జీని గుడ్ ఇనఫ్‌ను పెళ్లి చేసుకున్న ప్రీతీ జింటా ఓ సినిమా ఒప్పుకున్నారు. దాన్నిబట్టి ఇంటి బాధ్యతలతో పాటు తన కెరీర్‌ను కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది. దాదాపు మూడేళ్ల క్రితం ‘ఇష్క్ ఇన్ పారిస్’ అనే చిత్రంలో క నిపించిన ప్రీతి ఆ తర్వాత వేరే సినిమాలు చేయలేదు. ఇప్పుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ‘భయ్యాజీ సూపర్‌హిట్’ అనే చిత్రంలో  కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రీతి తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి నీరజ్ పాఠక్ దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement