మూడేళ్ల తర్వాత సూపర్ హిట్!
పెళ్లయ్యాక కథానాయికలు వెండితెర మీద సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ, ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ జీని గుడ్ ఇనఫ్ను పెళ్లి చేసుకున్న ప్రీతీ జింటా ఓ సినిమా ఒప్పుకున్నారు. దాన్నిబట్టి ఇంటి బాధ్యతలతో పాటు తన కెరీర్‌ను కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది. దాదాపు మూడేళ్ల క్రితం ‘ఇష్క్ ఇన్ పారిస్’ అనే చిత్రంలో క నిపించిన ప్రీతి ఆ తర్వాత వేరే సినిమాలు చేయలేదు. ఇప్పుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ‘భయ్యాజీ సూపర్‌హిట్’ అనే చిత్రంలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రీతి తన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి నీరజ్ పాఠక్ దర్శకుడు.