RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌ | Preity Zinta Staring At Kohli Is Cute Video Inside: Fans Reacts After RCB Beat PBKS Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌

Published Fri, May 10 2024 4:42 PM

సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌(PC: BCCI/Jio Cinema)

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ కథ ముగిసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో పంజాబ్‌ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్‌ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.

కోహ్లి వికెట్‌ పడగానే 
కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్‌ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.

అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.

లక్ష్య ఛేదనలో పంజాబ్‌ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.

సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్‌ వైరల్‌
ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.

ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్‌ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. 

సంజీవ్‌ గోయెంకాకు చురకలు
మ్యాచ్‌ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్‌ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. 

కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. ‌

చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement