
'ప్రామిస్.. పెళ్లి చేసుకోవటం లేదు'
తన పెళ్లిపై వస్తున్న వార్తల విషయంలో ప్రీతీ జింతా నోరు విప్పింది. టాలీవుడ్, బాలీవుడ్లలో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రీతి, తరువాత బిజినెస్ మీద దృష్టి పెట్టి సినిమాలకు...
తన పెళ్లిపై వస్తున్న వార్తల విషయంలో ప్రీతీ జింతా నోరు విప్పింది. టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రీతి, తరువాత బిజినెస్ మీద దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది. పంజాబ్ క్రికెట్ జట్టును సొంతం చేసుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి క్రికెట్ మ్యాచ్లకు హాజరవుతూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అదే సమయంలో ఆ టీం మెంబర్ యువరాజ్ సింగ్తో పాటు, తన సహయజమాని నెస్ వాడియాలతో ప్రేమాయణాలు కోనసాగించినట్టుగా వార్తలు వినిపించాయి.
తన ప్రియుడు నెస్ వాడియా తనను వేదిస్తున్నాడంటూ వార్తల్లోకెక్కిన ప్రీతి ఆ తరువాత చాలా కాలం పాటు ఎవరికి కనిపించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ బ్యూటి. కొద్ది రోజులుగా గినె అనే అమెరికన్తో సన్నిహితంగా ఉంటున్న ఈ బ్యూటి 2016 జనవరిలో అతడిని పెళ్లాడుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయినట్టుగా చెప్పారు. ఈ వార్తలన్నింటిని తన అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఖండించింది ప్రీతి జింతా.
'నేను 2016 జనవరిలో పెళ్లి చేసుకోవటం లేదు. ప్రామిస్. అలాంటి వార్త ఏదైనా ఉంటే ముందు నేనే తెలియజేస్తా..' అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే గినెతో తన రిలేషన్పై మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో పెళ్లి విషయం నిజం కాకపోయినా గినెతో ప్రేమ విషయం మాత్రం నిజమే అంటున్నారు బాలీవుడ్ సినీ జనాలు.
Also It's getting a bit wierd telling people that I'm not getting Married in January, I PROMISE I will TELL U ALL AS & WHEN I DO !!! Ting
— Preity zinta (@realpreityzinta) November 27, 2015