
ముంబై : బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ స్టేటస్ స్టేట్‌మెంట్ కోసం రూ లక్షలు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. హీరోయిన్లయితే యాక్సెసరీస్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. దుస్తులు, షూస్ నుంచి ఏ చిన్న వస్తువైనా తమ స్ధాయిని చాటేలా చూసుకుంటున్నారు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా లంచ్ చేసేందుకు బయటికి వస్తూ స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. బ్లూ షర్ట్, మ్యాచింగ్ బాటమ్స్‌తో పాటు ఆమె ధరించిన బ్యాగ్ అందరినీ ఆకర్షించింది. ఈ బ్యాగ్ ఖరీదు రూ 3 లక్షలు కావడం గమనార్హం. అసలు ఆమె బ్యాగ్ కోసం ఖర్చు చేసిన డబ్బుతో ఓ సాధారణ కుటుంబం ఏడాది పాటు బతికేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment