
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం సహచరుడు హార్దిక్ పాండ్యాతో కలిసి టీవీ టాక్ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాదంలో భాగమయ్యాడు. అతను ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాడి గురించి పంజాబ్ టీమ్ యజమాని, సినీ నటి ప్రీతి జింటా సానుకూలంగా మాట్లాడింది. అతను చాలా మంచివాడంటూ కితాబిచ్చింది. ‘రాహుల్ చాలా చాలా మంచి వ్యక్తి. టీవీ షో వివాదమంతా ముగిసిన గతం.
టీవీ షో వివాదాస్పదమైన తీరు బాధాకరం. నిజాయితీగా చెప్పాల ంటే రాహుల్‌కు మహిళలంటే ఎంతో గౌరవం ఉంది. కాబట్టి అసలు అదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అయితే ఇలాంటి ఘటనలు జీవితంలో నేర్చుకునే అవకాశాన్ని ఇస్తాయి’ అని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. ఆర్థికపరంగా చూస్తే ఐపీఎల్‌లో తా ము పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తిరిగొచ్చిందని, ఇప్పుడు టైటిల్ సాధించడం ఒక్కటే తమ లక్ష్యమని ఈ సందర్భంగా జింటా చెప్పింది.
ఐపీఎల్‌లో రాహుల్ వ్యాపారం...
స్ట్రీట్‌వేర్ బ్రాండ్ ‘గల్లీ లివ్ ఫాస్ట్’ ఐపీఎల్‌లో రెండు జట్లతో జత కట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లకు ఈ బ్రాండ్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ‘గల్లీ లివ్ ఫాస్ట్’కు కేఎల్ రాహుల్ సహయజమాని కావడం విశేషం.