Kings eleven
-
కింగ్స్ ఎలెవన్ నాలుగో విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో కింగ్స్ ఎలెవన్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. చార్జర్స్ ఎలెవన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ జట్టు మూడు పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. కింగ్స్ జట్టు బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మాŠయ్చ్’ పి.తపస్వీ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చార్జర్స్ జట్టులో రషీద్ (41 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుమంత్ (39) మెరిసినా కీలకదశలో అవుటవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ సీఆర్ జ్ఞానేశ్వర్ (52; 6 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. మరో మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలుత టైటాన్స్ జట్టు 8 వికెట్లకు 151 పరుగులు చేయగా... చాంపియన్స్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రికీ భుయ్ (42 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. గిరినాథ్ (33), అశ్విన్ హెబర్ (36) కూడా రాణించడంతో చాంపియన్స్ జట్టు ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. క్వార్టర్స్‌లో దివిజ్ జంట నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): అస్తానా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బామ్‌బ్రిడ్జ్ ద్వయం 7–5, 4–6, 10–6తో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) జోడీని ఓడించింది. -
రాహుల్ చాలా మంచి అబ్బాయి!
న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం సహచరుడు హార్దిక్ పాండ్యాతో కలిసి టీవీ టాక్ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాదంలో భాగమయ్యాడు. అతను ప్రస్తుతం ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాడి గురించి పంజాబ్ టీమ్ యజమాని, సినీ నటి ప్రీతి జింటా సానుకూలంగా మాట్లాడింది. అతను చాలా మంచివాడంటూ కితాబిచ్చింది. ‘రాహుల్ చాలా చాలా మంచి వ్యక్తి. టీవీ షో వివాదమంతా ముగిసిన గతం. టీవీ షో వివాదాస్పదమైన తీరు బాధాకరం. నిజాయితీగా చెప్పాల ంటే రాహుల్‌కు మహిళలంటే ఎంతో గౌరవం ఉంది. కాబట్టి అసలు అదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అయితే ఇలాంటి ఘటనలు జీవితంలో నేర్చుకునే అవకాశాన్ని ఇస్తాయి’ అని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది. ఆర్థికపరంగా చూస్తే ఐపీఎల్లో తా ము పెట్టిన పెట్టుబడి ఎప్పుడో తిరిగొచ్చిందని, ఇప్పుడు టైటిల్ సాధించడం ఒక్కటే తమ లక్ష్యమని ఈ సందర్భంగా జింటా చెప్పింది. ఐపీఎల్లో రాహుల్ వ్యాపారం... స్ట్రీట్‌వేర్ బ్రాండ్ ‘గల్లీ లివ్ ఫాస్ట్’ ఐపీఎల్లో రెండు జట్లతో జత కట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లకు ఈ బ్రాండ్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ‘గల్లీ లివ్ ఫాస్ట్’కు కేఎల్ రాహుల్ సహయజమాని కావడం విశేషం. -
కింగ్స్ పంజాబ్ ఓడితే నా పరువు పోదు!
ఆయనెవరో రాశాడు.. క్రికెట్ గురించి నాకేం తెలియదని! ఆయనే ఇంకో రహస్యం కూడా కనిపెట్టాడు. నా ట్వీటర్ స్టేటస్‌లో యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎంట్రప్రెన్యూర్, హ్యూమన్ బీయింగ్ అండ్ క్రికెట్ ఫ్యాన్ అని మాత్రమే ఉంటుంది కనుక క్రికెట్ గురించి నేనేం మాట్లాడ కూడదట. నా.. కో-ఓనర్లు నెస్ వాడియాని, మోహిత్ బర్మన్‌ని, కరణ్ పాల్ని అనగలడా ఆ మాట? పన్నెండు టెస్టులు ఆడినవాడిని, పదిహేను వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఉన్నవాడిని, వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్ని, టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌ని.. ది గ్రేట్ సంజయ్ బంగర్‌ని పట్టుకుని ప్రీతీ అంతమాట అంటుందా అని ఆయన ఎక్స్ప్రెషన్! ఏమన్నాను? బెహర్డియన్కి బదులుగా అక్షర్‌ని పంపి ఉండాల్సింది అనే కదా! అది కోచ్‌కి పాఠాలు నేర్పడం అవుతుందా? ఒక్క రన్లో ఓడిపోతే ఎవరికి మాత్రం కోపం రాదు? అయినా అది నాకు టీమ్ ఓనర్‌గా వచ్చిన కోపం కాదు. క్రికెట్ లవర్‌గా వచ్చిన కోపం. ఏం? ఆడవాళ్లకు కోపం రాకూడదా? కోపంలో ఆడవాళ్లు పెద్దగా అరవకూడదా? కోపాన్ని కూడా వాళ్లు చక్కటి చిరునవ్వుతోనే ప్రదర్శించాలా? హార్ట్ బ్రేక్ అయ్యాక ఆడేంటి? మగేంటి? లాస్ట్ మ్యాచ్‌లో అక్షర్ బాగా ఆడాడు. అందుకే అతన్ని పంపించి ఉండాల్సింది అన్నాను. కామన్సెన్స్ కదా! ఈ మాట చెప్పడానికి బ్యాట్ పట్టుకోవడం తెలిసుండాలా? బాల్ విసరడం తెలిసుండాలా? చావనిస్ట్ పిగ్స్. జెనెటిక్ ప్రాబ్లమేదో ఉన్నట్లుంది ఈ జర్నలిస్టులకి. ప్రెజెంటేషన్ సెరమనీకి నేను వెళ్లకుండా మా మదర్ని పంపానట. అదో ఇష్యూ! మ్యాచ్‌ని వదిలేసి, మ్యాచ్ అయిపోయాక స్టేడియంలో మిగిలిన చెత్తనంతా పోగేసుకుంటున్నారు! ‘మదర్స్ డే కదా. అందుకనే అలా చేశాం’ అని మా టీమ్ మేనేజర్ చెప్పాడు. ‘మదర్స్ డే తర్వాతి రోజు గదా మ్యాచ్ జరిగింది’ అని వాళ్ల పాయింట్. గొప్ప ఇన్వెస్టిగేషనే! ఐపీఎల్ అయ్యాక అవార్డు ఇవ్వాలి ఆ రిపోర్టర్‌కి. గొప్పవాళ్లు కొంతమంది ఉంటారు. దేనికీ రియాక్ట్ కారు. ముక్కులోంచి, మూతిలోంచి, కంటిలోంచి, ఒంటిలోంచి దేన్నీ బయటికి రానివ్వరు. నేను అంత గొప్పదాన్ని కాదు. కోపాన్ని దాచుకోలేను. సంతోషాన్ని ఆపుకోలేను. నాకు తెలీకుండా నా ఫీలింగ్స్ అన్నీ నా ముఖంలోంచి తన్నుకొచ్చేస్తాయి. మనకెంత అందమైన ముఖం ఉందని కాదు.. అందులో ఎంత నిజాయితీ ఉందనేది ముఖ్యం. ముఖంలో నిజాయితీ ఉన్నప్పుడు మాటలో మొహమాటం ఉండదు. ముఖస్తుతి ఉండదు. నచ్చంది నచ్చలేదని చెప్తాం. నమ్మింది ఎవరికి నచ్చకున్నా చేసేస్తాం. ఐపీఎల్‌లోకి నేను అలాగే వచ్చాను. విత్ మై హార్ట్ అండ్ సోల్. ఆడామా, ఓడామా అని కాదు. గెలిచేలా ఆడామా లేదా.. అదీ నా కన్సర్న్. కింగ్స్ ఎలెవన్ జట్టు ప్లే-ఆఫ్స్‌కి వెళ్లలేకపోవడం నాకు పరువు తక్కువేం కాదు. పూర్ పెర్ఫార్మర్ అనిపించుకోవడమే బాధ. ప్రేమ లేకపోతే బాధ కలుగుతుందా? బాధ లేకుండా కోపం వస్తుందా? ఐ లవ్ క్రికెట్. - మాధవ్ శింగరాజు