'నేను ఇంకా వర్జిన్ నే'
'నేను ఇంకా వర్జిన్ నే'
Published Tue, Dec 3 2013 2:25 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
బాలీవుడ్ లో నటుడిగానే కాకుండా.. మోస్ట్ ఎలిజిబుల్ బాచ్ లర్ గా సల్మాన్ ది అగ్రస్థానం. వయస్సు యాభై సంవత్సరాలు సమీపిస్తున్న కండలవీరుడికి ఇంకా పెళ్లి మీద ధ్యాస లేదు. కెరీర్ ఆరంభం నుంచి బాలీవుడ్ తారలతో అఫైర్లు, లింకులు, డేటింగ్ లాంటి హాట్ హాట్ వార్తలతో అభిమానులను ఆకట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలో సంగీతా బ్రిజ్లానీతో సల్మాన్ అఫైర్ అప్పట్లో సంచలనమే. ఆ తర్వాత, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ సల్లూ భాయ్ అఫైర్ల జాబితాలో నిలిచారు. ఇక ఐశ్వర్యరాయ్ బచ్చన్ తో నడిపిన ప్రేమాయణం చాలా సెన్సేషన్ గా నిలిచింది. పెళ్లిదాకా వచ్చిన వ్యవహారం ఆగిపోవడం వెనుక సల్మాన్ వ్యక్తిగత ప్రవర్తనే కారణమని చెప్పుకుంటారు. ఈ అఫైర్లన్ని బయటకు తెలిసినవి కాగా, తెలియని డేటింగ్, లింకులు చాలానే ఉంటాయనేది కాదనలేని వాస్తవం.
ఇదంతా ఎందుకంటే ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ లో ప్రసారమైన కాఫీ విత్ కరణ్ నాలుగవ సీజన్ లో కరణ్ జోహార్ తో మాట్లాడుతూ.. సల్మాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే జీవిత భాగస్వామి కోసం తనను తాను కాపాడుకుంటున్నాను అని సల్మాన్ అన్నారు. అందుకు ఇంకా నీవు వర్జిన్ వా అని కరణ్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ నవ్వుతూ అవును అంటూ తలాడించాడు. అందుకు ఎందరో బాలీవుడ్ తారలతో అఫైర్ ఉన్నాయని.. వారితో నీవు శృంగారంలో పాల్గొనలేదా అని కరణ్ అడిగిన మరో ప్రశ్నకు 'వాళ్లంతా నాకు స్నేహితులు మాత్రమే' అని సల్మాన్ జవాబిచ్చారు. అంతేకాకుండా బెడ్ పై తాను ఒంటరిగానే నిద్రించడం అలవాటు అని సల్మాన్ తెలిపాడు. ఒకవేళ తాను తెలిపిన ముగ్గురు హీరోయిన్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడిగిన మరో ప్రశ్నకు ప్రీతి జింటా అని ఠక్కున సమాధానమిచ్చాడు.
Advertisement