
ప్రీతి జింటా(ఫైల్ ఫోటో)
ముంబై: ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్‌ను సాధించిన భారత క్రికెట్ జట్టును అభినందించే క్రమంలో బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ‘తప్పు’లో కాలేశారు. టెస్టు సిరీస్ విజయం అని అనకుండా టెస్టు మ్యాచ్ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ‘ఆస్ట్రేలియాపై ‘టెస్ట్ మ్యాచ్’ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డులకెక్కిన బాయ్స్ ఇన్ బ్లూకు అభినందనలు. టీమిండియా విజయంలో చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు’ అని ట్వీట్ చేసింది.
దీనిపై నెటిజన‍్ల ఆగ్రహానికి గురయ్యారు ప్రీతి జింటా. అలాగే, ‘బాయ్స్ ఇన్ బ్లూ’ అని వాడడంపైనా మండిపడ్డారు. టీమిండియా ఆటగాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే బ్లూ జెర్సీ ధరిస్తారని అది కూడా తెలియదా? అని ఎద్దేవా చేశారు. సగం తెలివి చాలా ప్రమాదకరం అని దుమ్మెత్తిపోశారు. నెటిజన్ల కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి తన ట్వీట్‌ను డిలీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment