30 దాటినా ఇప్పటికీ ఒంటరే.... | Bollywood actresses over 30 and still single | Sakshi

30 దాటినా ఇప్పటికీ ఒంటరే....

Apr 26 2014 12:37 PM | Updated on Apr 3 2019 6:23 PM

30 దాటినా ఇప్పటికీ ఒంటరే.... - Sakshi

30 దాటినా ఇప్పటికీ ఒంటరే....

ఎప్పుడో 30 దాటిన ప్రీతీజింటా, ఊర్మిళా మతోంద్కర్, టబూ వంటి బ్యూటీలు మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నారు.

బెంగాలీ బ్యూటీ రాణి ముఖర్జీ ఎట్టకేలకు 36 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కింది. ఎప్పుడో 30 దాటిన ప్రీతీజింటా, ఊర్మిళా మతోంద్కర్, టబూ వంటి బ్యూటీలు మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్లుగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా, అమృతారావు వయసు కూడా మూడు పదులు దాటిపోయింది.
 
 హాలీవుడ్ సహా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ప్రియాంక, హర్మన్ బవేజా, షహీద్ కపూర్‌తో డేటింగ్ చేసినా ఎవరినీ మనువాడలేదు. లేటు వయసులోనూ హాట్‌గా నటించే బిపాసా బసు కూడా డినో మోరియా, జాన్ అబ్రహంతో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. జాన్‌కు 2011లో గుడ్‌బై చెప్పేసింది. తాను మళ్లీ ప్రేమలో పడ్డానంటూ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. అతడు ఎవరో కాదు.. ‘వాట్స్ యువర్ రాశి’ ఫేం హర్మన్ బవేజా! వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.
 
 కునాల్ ఖేముతో పీకల లోతు ప్రేమలో ఉన్న సోహా అలీఖాన్‌కు 30 ఏళ్లు ఎప్పుడో దాటాయి. పెళ్లి గురించి ఈమె కూడా ఏమీ మాట్లాడడం లేదు. మరో బ్యూటీ నేహా ధూపియా కొన్నాళ్లు రిత్విక్ భట్టాచార్య అనే క్రీడాకారుడితో డేటింగ్ చేసింది. వెనెజులా నటుడు జేమ్స్ సిల్విస్టర్‌తోనూ చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు వార్తలు వచ్చాయి. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ ఏదో ఉందంటూ కథనాలు వినిపించాయి.
 
నేహ వీటి గురించి ఎప్పుడూ స్పందించలేదు. పెళ్లి గురించి కూడా మాట్లాడలేదు. 32 ఏళ్ల వయసున్న ఉన్న అమృతారావు మొదట పాక్ గాయకుడు ఫర్హాన్ సయీద్‌ను ప్రేమించింది. తరువాత ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌తోనూ సన్నిహితంగా ఉంది. అయితే వీరిలో ఎవరినీ అమృత పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. కహోనా ప్యార్ బ్యూటీ అమిషా పటేల్, మరో బెంగాలీ బ్యూటీ రైమాసేన్ కూడా లేడీ బ్యాచిలర్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement