
లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని సూచించా
ఐపీఎల్‌లో పాల్గొనే క్రికెటర్లకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే ఫిక్సింగ్‌కు తావుండదని సూచించినట్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని
ఐపీఎల్‌లో పాల్గొనే క్రికెటర్లకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే ఫిక్సింగ్‌కు తావుండదని సూచించినట్లు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని ప్రీతి జింతా తెలిపింది. ఇటీవల ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ ఫ్రాంచైజీలతో సమావేశమైన సందర్భంగా ఈ సూచన చేశానని, అంతే తప్ప తాను ఏ క్రికెటర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేయలేదని చెప్పింది. కొందరు పంజాబ్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడి మ్యాచ్‌లను వదిలేశారని తాను చెప్పినట్లు వస్తున్న కథనాలను ప్రీతి జింతా ఖండించింది.