ప్రీతి నన్ను తిట్టలేదు: సంజయ్ బంగర్ | Furious Preity Zinta abuses KXIP coach Sanjay Bangar in team dug-out | Sakshi
Sakshi News home page

ప్రీతి నన్ను తిట్టలేదు: సంజయ్ బంగర్

Published Fri, May 13 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

ప్రీతి నన్ను తిట్టలేదు: సంజయ్ బంగర్

ప్రీతి నన్ను తిట్టలేదు: సంజయ్ బంగర్

న్యూఢిల్లీ: బెంగళూరు చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా తనను తిట్టినట్లు వచ్చిన కథనాలను జట్టు కోచ్ సంజయ్ బంగర్ తోసిపుచ్చారు.  మ్యాచ్ తర్వాత సహజంగా జరిగే చర్చలే తమ మధ్య జరిగినట్లు ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చారు. ఉన్నవీ లేనివీ అన్నీ కలిపి తప్పుడు కథనాలు రాశారని ఆరోపించారు. మరోవైపు ప్రీతి కూడా ఈ కథనాలను ఖండించింది. ‘మా కోచ్‌ను తిట్టడం అవాస్తవం. నేను ఎలాంటి మాటలు అనలేదు.

ఈ కథనాలు నిజం కాదు. నేను, సంజయ్ ఇద్దరమూ ఈ కథనాలు కొట్టిపారేసినా మళ్లీ పుడుతున్నాయి. ఈ వార్తలతో విసిగిపోయాను. కొంత మంది జర్నలిస్ట్‌లు సమయం చూసుకొని మరీ రాస్తున్నారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని ఇలా చేస్తున్నారు’ అని ప్రీతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. బెంగళూరుతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదంటూ ప్రీతి జింతా... బంగర్‌ను బూతులు తిట్టిందంటూ ఓ ఇంగ్లిష్ పత్రిక కథనం రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement