
వెండితెర, బుల్లితెర కళాకారులకు ప్రోత్సాహక అవార్డుల ప్రదానం శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం హాలులో జరిగింది. మహా ఫైన్ ఆర్ట్స్ అనురాధ, యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా నిర్వాహకుడు కలైమామణి డాక్టర్ నెల్‌లై సుందరరాజన్ నిర్వహించిన ఈ వేడుకలో హైకోర్టు న్యాయమూర్తి ఎస్.కె.కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం పలువురిని అవార్డులు అందజేశారు. నటి స్మృతి వెంకట్, అనుకృష్ణ, గాయత్రి రెమ, నటుడు ఇమాన్ అన్నాన్ని, అరుణ్‌కుమార్, సన్ టీవీ న్యూస్‌రీడర్ కంకణి శేఖర్, డాక్టర్ పెనజీర్ తదితరులు అవార్డులను అందుకున్నారు. భాగ్యరాజ్ ఇంజినీరింగ్ కాలేజీ డైరక్టర్ మాలిని జయచంద్రన్, చైర్మన్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment