ఔషధ రంగంలో ఆన్‌లైన్ విక్రయాలు ప్రమాదకరం | Buying Medicines over the Internet may Possible Dangerous | Sakshi
Sakshi News home page

ఔషధ రంగంలో ఆన్‌లైన్ విక్రయాలు ప్రమాదకరం

Published Tue, Oct 13 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

Buying Medicines over the Internet may Possible Dangerous

ఇ-ఫార్మసీ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయానికి అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ నెల 14న ఆలిం డియా స్థాయిలో ఔషధ దుకాణాల బంద్ పాటించి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని ఆలిం డియా కెమిస్ట్ డ్రగ్గిస్టుల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో ఔషధ దుకాణదారుల ప్రయోజనాలతో పాటు, ప్రజాప్రయోజనాలు కూడా ఇమిడి ఉండ డంతో ఈ అంశం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. బహుళజాతి కంపెనీలు పట్టణ పొలిమేరలు దాటి, మారుమూల పల్లెల్లోని సామాన్యుల వంటగదిలోకి కూడా ప్రవేశించి, గ్రామీణ జీవనాన్ని కలుషితం చేస్తున్న విషయం ఎవరికీ తెలియనిదికాదు.

ఇప్పుడు ఈ కంపెనీల దృష్టి ఔషధ రంగంపై కూడా పడింది. దానికనుగుణంగా బహుళజాతి కంపెనీల ప్రయోజ నాలు కాపాడడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కంపెనీలు ఔషధ రంగంలోకి కూడా ప్రవేశిస్తే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్ విధానం అమల్లో ఉన్న దేశాల్లో ఔషధ వినియోగం దుర్వినియోగం అవుతోందన్న వార్తలు ఒకవైపు కలవరపెడుతుంటే, భారతదేశంలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకోవ డం ఎవరి ప్రయోజనాలు కాపాడడానికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 నిషాకు, మత్త్తుకు అలవాటు పడిన కొందరు ఇప్పటికే ఆన్‌లైన్ విధానం ద్వారా ఔషధాలు తెప్పిం చుకొని ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్నారు. ఐపిల్, ఎంటీపీ కిట్స్, డైజిపామ్, కొడిన్ లాంటి మందులు క్వాలిఫైడ్ డాక్టరు సిఫారసు మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. కాని ఆన్‌లైన్ విధా నంలో ఎవరి ఇష్టానుసారం వారు వాడితే ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవైపు ప్రభు త్వం క్వాలిఫైడ్ డాక్టర్ సిఫారసు లేకుండా మందులు అమ్మవద్దని కెమిస్టులపై ఒత్తిడి చేస్తూ, మరోవైపు దొడ్డిదారిన ఆన్‌లైన్ విధానాన్ని చట్టబద్ధం చేయాల నుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
 మనదేశంలో ఎనిమిది లక్షల ఔషధ దుకాణాలు న్నాయి. కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఈ దుకా ణాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇ-ఫార్మసీ విధానానికి పచ్చజెండా ఊపి ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకానికి అనుమతిస్తే,పెద్ద ఎత్తున ప్రజ లకు నష్టం జరగడంతోపాటు, లక్షలాది దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న కోటి ఇరవై లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధినపడే దుస్థితి దాపురిస్తుంది. కనుక ప్రభుత్వం తక్షణమే ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకం ఆలోచనను విరమించుకొని, ఔషధ రంగం లో బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని నిరోధించాలి. నాణ్యమైన మందులు చవక ధరకు లభించే పకడ్బం దీ ఏర్పాట్లు చేయకుండా, ఔషధ రంగాన్ని బహుళ జాతి సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే ప్రజా రోగ్యం ప్రమాదంలో పడినట్లే. అందుకని పాలక వర్గాలు విజ్ఞతతో వ్యవహరించాలి.
 (అక్టోబర్ 14న దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ సందర్భంగా)
 యండి.ఉస్మాన్ ఖాన్, అక్షర సాహితి అధ్యక్షులు, సీనియర్ కెమిస్ట్: మొబైల్: 99125 80645

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement