Ram Gopal Varma Compare Dangerous Movie Heroines to RRR Movie Heros - Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి హీరోయిన్లతో తారక్‌, చరణ్‌ని పోల్చిన ఆర్జీవీ.. ట్వీట్‌ వైరల్‌

Published Thu, Mar 31 2022 11:18 AM | Last Updated on Thu, Mar 31 2022 1:20 PM

Ram Gopal Varma Compare Dangerous Movie Heroines To RRR Movie Heros - Sakshi

సినిమాలను ప్రచారం చేయడంలో రామ్‌గోపాల్‌ వర్మ స్టైలే వేరు. ట్రెడింగ్‌లో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన సినిమా ప్రమోషన్ల కోసం వాడేస్తాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘డేంజరస్‌’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది) మూవీ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని వాడేశాడు. ‘రాజమౌళి.. మీకు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లాంటి డేంజరస్‌ బాయ్స్‌ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్‌ అమ్మాయిలు ఉన్నారు’అంటూ ట్వీట్‌ చేస్తూ..  ఎన్టీఆర్‌, చరణ్‌లతో ఉన్న జక్కన్న ఫోటోకు ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఉన్న తన ఫోటోని జతచేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

కాగా, ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై ఆర్జీవీ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడేమో ఇలా తన సినిమా ప్రమోషన్స్‌కి వాడుకోవడం గమనార్హం. 

ఇక డేంజరస్‌ సినిమా విషయానికొస్తే..అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో రిలీజ్‌ కాబోతుంది.  ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్‌ అంశాలతో క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement