సెల్ వాడుతున్నారా అయితే!
– రేడియేషన్‌తో గుండెజబ్బుల ప్రమాదం
– వాడకాన్ని తగ్గించాలంటున్న నిపుణులు
వరికుంటపాడు: ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవ అభివృద్దికి ఎంతగా తోడ్పడుతుందో అంతే వేగంగా అనర్ధాలకు దారితీస్తోంది. ప్రధానంగా సెల్‌ఫోన్. సాంకేతి రంగంలో ఓ భాగమైన సెల్‌ఫోన్ మానవుని తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణభూతమవుతున్నాయి. సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో గుండెజబ్బులకు దారితీస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, టవరుకు టవరుకు మధ్య రెండు కి.మీ దూరం, గ్రామాలలో అయితే పది కి.మీ దూరంలో ఉండాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. ప్రైవేటు సెల్‌టవర్లు పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తుండడంతో వీటి ప్రభావం జీవరాశులపై తీవ్రంగా చూపుతున్నాయి. ఇప్పటికే సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావంతో పిచ్చుకలతో పాటు పలురకాల జాతుల పక్షులు కనుమరుగయ్యాయి.
రేడియేషన్‌తో ఏర్పడే సమస్యలు:
రేడియేషన్ ప్రభావం గర్భిణుల ఆరోగ్యంపై తీవ్రంగా చూపుతుంది. మానసిక, శారీరక వికలాంగులుగా పిల్లలు పుట్టే అవకాశముంది. అలాగే మానవ శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె, మూత్రపిడాలు దెబ్బతినే అవకాశంవుందని వైదనిపుణులు చెపుతున్నారు. రకరకాల చర్మవ్యాధులు సంభవిస్తాయి. గుండెజబ్బులకు రేడియేషన్ కారణమని పలు అధ్యయనాల్లో తెలుస్తోంది. జన్యుపరంగా మనిషి ఎదుగుదలను నిరోధిస్తుంది. మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రబావం చూపుతాయి. వినికిడి లోపం ఏర్పడుతుంది. ప్రైవేటు టవర్ల యజమానులు మెరుగైన సేవలందించేందుకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ పెంచడం ద్వారా రేడియేషన్ ప్రభావం ఎక్కువగా జీవరాశులు, మానవులపై చూపుతుంది
సెల్‌ఫోన్ వాడే విధానం:
సెల్‌ఫోన్‌ను వీలైనంత తక్కువగా వాడడం మంచిది. చొక్కా జేబులో సెల్‌ఫోన్ పెట్టుకోకుండా వీలైనంత ప్యాంటు బెల్టుకు దీనిని అమర్చుకోవాలి. కాల్ అనుసంధానం అయ్యేటప్పుడు చెవి దగ్గరగా పెట్టుకోకూడదు. వీలైనంత వరకు స్పీకరు ఆన్‌చేసి మాట్లాడడం కొంతమేర మేలని నిపుణులు తెలుపుతున్నారు.