
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం’. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ మిగతా భాషల్లో ‘డేంజర్’ పేరుతో విడుదలవుతుంది.
గతంలో భీమవరం టాకీస్ బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ‘మా ఇష్టం’ రావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు.
. @NainaGtweets SHUTTING UP @_apsara_rani in DANGEROUS..Film releasing in theatres on APRIL 8th pic.twitter.com/XbXlPUDZfE
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022
Comments
Please login to add a commentAdd a comment