
చేతికి అందుతున్న విద్యుత్తు తీగలు
- ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
మనూరు: మండలంలోని ముక్టాపూర్ శివారులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలను సరి చేయాలని గతంలో సంబంధిత అధికారులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ తీగలు చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని వెంటనే వాటిని సరి చేయాలని ముక్టాపూర్ ప్రజలు డిమాండ్ చేశారు.