బాల్కొండ, న్యూస్‌లైన్ : మండలంలోని పోచంపాడ్ కూడలి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రహదారిని దాటుతూ రోడ్డు ప్రమాదాలకు గురైనవారి వివరాలు చూస్తే భయమేస్తోంది. 2009 సంవత్సరంలో 14 మంది, 2010లో 8 మంది, 2011లో 13మంది, 2012లో 15 మంది 2013లో ఇప్పటి వరకు 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. అసలే ట్రాఫిక్ నియమాలు తెలియక సతమతమవుతున్నవారు రోడ్డు ఎలా దాటాలో తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైవే అథారిటీ అధికారులూ ప్రయాణికుల యోగ క్షేమాలను పట్టించుకున్న దాఖాలాలు లేవు. నాలుగు లైన్ల రహదారి అయిందని సంతోషపడాలో, రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి బాధపడలో తెలియని స్థితిలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అతి ప్రమాద కరం ముప్కాల్ క్రాసింగ్
మండలంలోని ముప్కాల్ బైపాస్‌వద్ద ఉన్న జాతీయ రహదారి క్రాసింగులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. పొలాలకు వెళ్లేందుకు వేరే దారి లేక రైతులు జాతీయ రహదారిని దా టుతూ ప్రమాదలకు గురవుతున్నారు. ఆ క్రాసింగ్ నుంచి మం డలంలోని పలుగ్రామాలకు దూరభారం తగ్గేలా మరో దారి ఉండటంతో ప్రయాణికులు సైతం రోడ్డును క్రాస్ చేస్తున్నా రు. క్రాసింగ్‌ల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు ఎలాంటి నిరోధకాలు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొడుతున్నాయి. హైవే క్రాసింగుల వద్ద ప్రమాదాలు నివారించడానికి ఆర్‌డీఓతో పరిశీలన చేయించి, గతంలో జిల్లా యంత్రాంగం హైవే అథారిటీకి పలు సూచనలు చేసింది.
క్రాసింగుల వద్ద స్టాపర్‌లు పెట్టాలని అప్పటి ఆర్మూర్ డీఎస్పీ నర్సింహా సూచించినా హైవే అధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు ఇది చేయాలి, అది చేయాలని మాట్లాడుతారు. తర్వాత ఊసెత్తరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దిం చి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలంటున్నారు.
చాకిర్యాల్ వద్దా అంతే
మండలంలోని చాకీర్యాల్ వద్ద గల క్రాసింగ్ సైతం ప్రమాదాలకు నిలయంగా మారింది. అక్కడ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైతులకు అప్రోచ్ రోడ్డు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రెండు క్రాసింగ్‌ల వద్ద వెంటనే అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
తాజాగా పోచంపాడ్ క్రాసింగ్
తాజాగా పోచంపాడ్ క్రాసింగ్ ప్రమాదాలకు నిలయంగా మారిం ది. మంగళవారం జరిగిన ప్రమాదంలో విద్యార్థినితో పాటు, ఆమె తండ్రి మృతి చెందడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైవే పై ఉన్న నిబంధనలు తెలియక కొందరు, హైవే అధికారులు నిర్లక్ష్యంతో మరి కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు.
బలి తీసుకుంటున్న క్రాసింగులు
Published Wed, Oct 23 2013 4:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement