
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌లో తమ ప్రతిభను వీడియోల రూపంలో బయటపెట్టడానికి యువత చాలా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. టిక్‌టాక్‌లో ఫన్నీ వీడియోలు చేయటంతోపాటు.. పాటలు, డైలాగ్‌లు, డాన్స్‌లు కూడా చేస్తున్నారు. దీంతోపాటు టిక్‌టాక్‌లో చాలెంజ్ వీడియోల ట్రెండ్ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టిక్‌టాక్ చాలెంజ్ వీడయోలకోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. ఫన్నీగా మొదలైన టిక్‌టాక్ చాలెంజ్ వీడియోలు ప్రస్తుతం ప్రమాదకరస్థాయికి చేరుకోవటం గమనార్హం. ఆ కోవలోకి చెందిందే ఈ టిక్‌టాక్ కొత్త వీడియో చాలెంజ్.. అది ఎలా చేస్తారంటే.. మోబైల్ చార్జర్ అడాప్టర్‌ను, ఎలక్ట్రిక్ సాకెట్‌కి అమర్చాలి. కానీ, సాకెట్‌కి, మోబైల్ చార్జర్ అడాప్టర్‌కి మధ్య కొంత గ్యాప్ ఉండెలా చూడాలి. ఆ గ్యాప్‌లో ఒక నాణెంను నెమ్మదిగా జారవిడువాలి. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చి సాకెట్ కాలిపోతుంది. పెద్దగా మంటలు కూడా వస్తాయి. కానీ, జారవిడచేటప్పుడు ఆ నాణెం కింద పడుకుండా చేయటమే ఈ చాలెంజ్ విశేషం.
కాని, ఈ టిక్‌టాక్ కొత్త చాలెంజ్ చాలా ప్రమాదకరమైందని ప్రయత్నించిన పలువురు వాపోతున్నారు. అదేవిధంగా ఈ చాలెంజ్‌ను ఎట్టిపరిస్థితుల్లో చేయడానికి ప్రయత్నించవద్దని మరికొంతమంది టిక్‌టాక్ వినియోగదారులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. అయితే ఈ ప్రమాదకర టిక్‌టిక్ చాలెంజ్ వీడియో తాజాగా సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. దీన్ని చేయడానికి ప్రయత్నించిన టిక్‌టాక్ వినియోగదారులు.. ఆ చాలెంజ్ వీడియో చేసే క్రమంలో వారు ఎదుర్కొన్న అనుభవాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోల్లో చార్జింగ్ అడాప్టర్‌లు, సాకెట్‌లు మంటల్లో కాలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment