క్యాన్సర్ అంటే అందరూ హడలిపోతారు. అలాంటిది దానికి మించి ప్రాణాంతకమైన మరొక వ్యాధా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే కనీసం క్యాన్సర్‌కి స్టేజ్‌లను బట్టి చికిత్స దొరకుతుంది. ఇదొచ్చిదంటే బతకడం కష్టం. పైగా చికిత్స చేయడం కూడా కష్టం. ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స కూడా లేదంట. క్యాన్సర్ కంటే ఈ వ్యాధి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? ఎందువల్ల వస్తుంది?.. తదితరాల గురించే ఈ కథనం.!
ఇవాళ ప్రపంచ సెప్సిస్ దినోత్సవం. ఇది క్యాన్సర్ కంటే ప్రాణాంతకమైంది. ప్రతి ఏడాది సెప్టంబర్ 19 సెప్సిస్ దినోత్సవాన్ని జరుపుతూ..ఆ వ్యాధి ప్రజల్లో అవగాహన కల్సిస్తున్నారు అధికారులు. అసలు సెప్సిస్ అంటే ఏంటీ.. ఎలా ప్రాణాంతకం అంటే..ఇది ఏమి ఇన్ఫెక్షన్ కాదు. శరీరలో కలిగే ప్రాణాంతక పరిస్థితిని సెప్సిస్ అంటారు. అధిక రోగనిరోధక ప్రతిస్పందన, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్‌లు ఈ సెప్టిక్ షాక్‌కి కారణం కావొచ్చు. రక్తంలో, ఎముకల్లో, పిత్తాశయం, కాలేయం, ఉదరకుహరం, అపెండిక్స్, ఊపిరితిత్తుల్లో న్యూమోనియా, తదితర భాగాలు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సెప్సిస్ షాక్‌కి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్‌లు కూడా సెప్సిస్ ప్రమాదానికి కారణం కావొచ్చని చెబుతున్నారు.
లక్షణాలు
- తీవ్ర జ్వరం
- అధిక రక్తపోటు
- హృదయ స్పందనల్లో క్రమరాహిత్యం
- శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు
- హృదయ స్పందనలలో క్రమరాహిత్యం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
- మూత్రవిసర్జనలో ఇబ్బందులు
- మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు
- వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం రంగు మారడం
- ప్లేట్‌లెట్ కౌంట్‌లో తగ్గుదల
- చెప్పలేనంత చలి
- స్పృహ కోల్పోవడం
ఎలాంటి వారు ఈ వ్యాధిబారిన పడతారంటే..
65 ఏళ్లు పైబడిన పెద్దలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మూత్రపిండాలు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సెప్సిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్నివిపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులు, పరిమిత వనురులు ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అధికా ఆదాయ దేశాల్లోని ఆస్పత్రుల్లో ఈ కేసులు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది లెక్కలేనన్ని మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది.
సెప్సిస్ కారణంగా వచ్చే సమస్యలు...
తగిన సమయంలో చికిత్స తీసుకోనట్లయితే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తగడ్డకట్టడం, అవయవాలు, వేళ్లు, కాలివేళ్లు చచ్చుపడిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదు.
నిర్ధారణ
దీని కారణంగా గడ్డకట్టే సమస్యల, అసాధారణంగా కాలేయం, మూత్రపిండాల పనితీరు ఉండటం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోవటం తదితరాలను బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు వైద్యులు.
చికిత్స:
రోగుల వైద్య చరిత్ర ఆధారంగా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో మాత్రం యాంటీబయాటిక్స్‌ని ఇస్తారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ వ్యాధి సోకిన కణజాలాన్ని తీసేయాల్సి ఉంటుందని వైద్యుల చెబుతున్నారు. ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి పూర్తి స్థాయిలో ఎలాంటి చికిత్స లేదని వెల్లడించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వ్యక్తిగ శుభ్రత పాటించాలి. అలాగే ఆహారాన్ని స్వీకరించటంలో నిర్లక్ష ధోరణి పనికిరాదు. నిల్వ ఆహారం కలుషితమైనవి తీసుకోకూడదు. ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడైనా రోగులు ఇలాంటి పరిశుభ్రతను పాటించినా సులభంగా బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
క్యాన్సర్ కంటే సెప్సిస్ ఎందుకు ప్రమాదకరం?
- ఈ వ్యాధి వేగవంతంగా ఇతర అవయవాలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరం పని తీరు సామర్థ్యం క్షీణిస్తుంది.
- రోగ నిర్థారణ ఆలస్యం కారణంగా మరణాలు సంభవించే రేటు 30% నుంచి 50% ఉంటుంది.
- సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాలను గుర్తించి త్వరితగతిన యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంపై వ్యాధి తగ్గుదల ఉంటుంది.
- ఈ వ్యాధి లక్షణాలు ఇతర సాధారణ అనారోగ్యాల మాదిరిగా ఉండటంతో అంత సులభంగా వైద్యులు గుర్తించడంలో విఫలమవుతుంటారు. అందువల్ల ఈ కేసులు ఎక్కువగా ప్రాణాంతకంగా మారినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరొకటి ఆ వ్యాధికి తగ్గ స్థాయిలో యాంటీ బయోటిక్స్ మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది.
- సెప్సిస్ ఇప్పటికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలికి వ్యాధులతో పోల్చితే తీవ్రమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్యానకి సవాలు విసురుతోంది. మరణాలు సంభవించకుండా ఉండేలా వినూత్న రీతిలో వ్యాధికారక వేగాన్ని తగ్గించి నయం చేసేలా చికిత్స విధానాలు అభివృద్ధి చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment