deseases
-
వర్షాకాలం: దోమల్ని తరిమి కొట్టే చిట్కాలు, ఈ మొక్కల్ని పెంచండి!
వర్షాకాలం వచ్చిందంటే... మేమున్నామంటూ దోమలు విజృంభిస్తాయి. దీంతో సీజనల్‌గా వచ్చే అనేక వ్యాధుల్లో చాలావరకు వివిధ రకాల దోమల వల్లే వస్తాయి. అందుకే దోమలను నివారించే కొన్ని సహజమైన నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో తడి, తేమ లేకుండా వాతావరణ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులుంటే మరింత జాగ్రత్త అవసరం. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇంటిని, ఇంటి చుట్టుపక్కలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, చిన్ని చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, కుండలు లాంటివాటిల్లో కూడా నీరు ఉండిపోకూడా జాగ్రత్త పడాలి. వర్షాకాలంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. దోమతెరలను వాడాలి.దోమలు తీపి వస్తువులు, శరీర దుర్వాసనకు ఆకర్షితులవుతాయని మనందరికీ తెలుసు, అయితే కొన్ని సుగంధ పరిమళాలు వాటికి నచ్చవు. అలాంటి కొన్ని రకాలు వాసనలొచ్చే మొక్కల్ని పెంచుకుంటే చుట్టూ ఉన్న దోమలు, ఇతర కీటకాల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా దోమల నివారణకు రసాయన రహిత పద్ధతుల ద్వారా దోమలను నివారించే ప్రయత్నాలు చేయాలి.పెరటి మొక్కలులెమన్ గ్రాస్: ఇంట్లో లెమన్ గ్రాస్ చెట్టు పెంచుకుంటే దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని ఇంటి బాల్కనీ లేదా మెయిర్ డోర్ దగ్గర ఏర్పాటు చేయాలి. లెమన్ గ్రాస్ వాసనకు దోమలు పారి పోతాయి.నిమ్మ ఔషధతైలం ఈ మొక్కను హార్స్‌మింట్ అని కూడా అంటారు. దీని సుగంధం దోమలను దూరం చేస్తుంది. ఇంకా తులసి మొక్కలు, బంతి పువ్వు మొక్కలు కూడా దోమల నివారణకు పనిచేస్తాయి. వేపాకుల్లో ఔషధ గుణాలు దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పుల్లో వేపాకులు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో వ్యాపించేలా చూసుకోవాలి. ఈ పొగ ప్రభావంతో దోమల బెడద క్రమంగా తగ్గుతుంది. వేపనూనె చర్మానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. కర్పూరం సువాసన కారణంగా దోమలను అరికట్టడానికి ఉపయోగించవచ్చు.వెల్లుల్లి ఉత్తమ సహజ దోమల వికర్షకాలలో ఒకటిగా చేస్తుంది. వెల్లుల్లి ఘాటైన రుచి , వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిని నీటిలో వేసి మరిగించి, ఆ నీటికి చుట్టూ పిచికారీ చేయండి. కొబ్బరినూనె, లవంగాలు: దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వ చేసి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు.టీ ట్రీ ఆయిల్ ఈ వాసన దోమలకు అస్సలు పడదు. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. అలాగే దోమ కుట్టిన చోట ఈ నూనె రాస్తే దురద తగ్గుతుంది.మస్కిటోకాయిల్స్, రిపెలెంట్స్, ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ఒడోమస్ వంటి ఉత్తమ నాణ్యతగల, హాని చేయని క్రీములు వాడవచ్చు. చిన్న పిల్లలు రాత్రి పూట కాళ్లను పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేయాలి. -
ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!
క్యాన్సర్ అంటే అందరూ హడలిపోతారు. అలాంటిది దానికి మించి ప్రాణాంతకమైన మరొక వ్యాధా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే కనీసం క్యాన్సర్‌కి స్టేజ్‌లను బట్టి చికిత్స దొరకుతుంది. ఇదొచ్చిదంటే బతకడం కష్టం. పైగా చికిత్స చేయడం కూడా కష్టం. ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స కూడా లేదంట. క్యాన్సర్ కంటే ఈ వ్యాధి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? ఎందువల్ల వస్తుంది?.. తదితరాల గురించే ఈ కథనం.! ఇవాళ ప్రపంచ సెప్సిస్ దినోత్సవం. ఇది క్యాన్సర్ కంటే ప్రాణాంతకమైంది. ప్రతి ఏడాది సెప్టంబర్ 19 సెప్సిస్ దినోత్సవాన్ని జరుపుతూ..ఆ వ్యాధి ప్రజల్లో అవగాహన కల్సిస్తున్నారు అధికారులు. అసలు సెప్సిస్ అంటే ఏంటీ.. ఎలా ప్రాణాంతకం అంటే..ఇది ఏమి ఇన్ఫెక్షన్ కాదు. శరీరలో కలిగే ప్రాణాంతక పరిస్థితిని సెప్సిస్ అంటారు. అధిక రోగనిరోధక ప్రతిస్పందన, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఈ సెప్టిక్ షాక్‌కి కారణం కావొచ్చు. రక్తంలో, ఎముకల్లో, పిత్తాశయం, కాలేయం, ఉదరకుహరం, అపెండిక్స్, ఊపిరితిత్తుల్లో న్యూమోనియా, తదితర భాగాలు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సెప్సిస్ షాక్‌కి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లు కూడా సెప్సిస్ ప్రమాదానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. లక్షణాలు తీవ్ర జ్వరం అధిక రక్తపోటు హృదయ స్పందనల్లో క్రమరాహిత్యం శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు హృదయ స్పందనలలో క్రమరాహిత్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మూత్రవిసర్జనలో ఇబ్బందులు మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం రంగు మారడం ప్లేట్లెట్ కౌంట్‌లో తగ్గుదల చెప్పలేనంత చలి స్పృహ కోల్పోవడం ఎలాంటి వారు ఈ వ్యాధిబారిన పడతారంటే.. 65 ఏళ్లు పైబడిన పెద్దలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మూత్రపిండాలు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సెప్సిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్నివిపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులు, పరిమిత వనురులు ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అధికా ఆదాయ దేశాల్లోని ఆస్పత్రుల్లో ఈ కేసులు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది లెక్కలేనన్ని మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది. సెప్సిస్ కారణంగా వచ్చే సమస్యలు... తగిన సమయంలో చికిత్స తీసుకోనట్లయితే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తగడ్డకట్టడం, అవయవాలు, వేళ్లు, కాలివేళ్లు చచ్చుపడిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదు. నిర్ధారణ దీని కారణంగా గడ్డకట్టే సమస్యల, అసాధారణంగా కాలేయం, మూత్రపిండాల పనితీరు ఉండటం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోవటం తదితరాలను బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు వైద్యులు. చికిత్స: రోగుల వైద్య చరిత్ర ఆధారంగా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో మాత్రం యాంటీబయాటిక్స్ని ఇస్తారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ వ్యాధి సోకిన కణజాలాన్ని తీసేయాల్సి ఉంటుందని వైద్యుల చెబుతున్నారు. ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి పూర్తి స్థాయిలో ఎలాంటి చికిత్స లేదని వెల్లడించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వ్యక్తిగ శుభ్రత పాటించాలి. అలాగే ఆహారాన్ని స్వీకరించటంలో నిర్లక్ష ధోరణి పనికిరాదు. నిల్వ ఆహారం కలుషితమైనవి తీసుకోకూడదు. ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడైనా రోగులు ఇలాంటి పరిశుభ్రతను పాటించినా సులభంగా బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. క్యాన్సర్ కంటే సెప్సిస్ ఎందుకు ప్రమాదకరం? ఈ వ్యాధి వేగవంతంగా ఇతర అవయవాలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరం పని తీరు సామర్థ్యం క్షీణిస్తుంది. రోగ నిర్థారణ ఆలస్యం కారణంగా మరణాలు సంభవించే రేటు 30% నుంచి 50% ఉంటుంది. సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాలను గుర్తించి త్వరితగతిన యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంపై వ్యాధి తగ్గుదల ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇతర సాధారణ అనారోగ్యాల మాదిరిగా ఉండటంతో అంత సులభంగా వైద్యులు గుర్తించడంలో విఫలమవుతుంటారు. అందువల్ల ఈ కేసులు ఎక్కువగా ప్రాణాంతకంగా మారినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరొకటి ఆ వ్యాధికి తగ్గ స్థాయిలో యాంటీ బయోటిక్స్ మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్సిస్ ఇప్పటికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలికి వ్యాధులతో పోల్చితే తీవ్రమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్యానకి సవాలు విసురుతోంది. మరణాలు సంభవించకుండా ఉండేలా వినూత్న రీతిలో వ్యాధికారక వేగాన్ని తగ్గించి నయం చేసేలా చికిత్స విధానాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. (చదవండి: క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!) -
వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!
వానల్లో... మొన్నటిదాకా మండించిన ఎండలు ఇప్పుడు చల్లటి వర్షాలను తీసుకువచ్చాయి. వర్షాకాలం అంటే ఇష్టం లేనిదెవరికి? ముఖ్యంగా పిల్లలకు మరీ ఇష్టం. ఎందుకంటే కాస్త గట్టి వానలు పడితే సెలవలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అంతా భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో వానాకాలం సెలవలే. సెలవల వరకు బాగానే ఉంది కానీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన పెద్దలకు మాత్రం కాస్త కష్టమే. ఆ మాటకొస్తే అంటువ్యాధులు ప్రబలే ఈ కాలంలో పెద్దవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం... వానరాకడా... మరొకటీ తెలియదని సామెత. ఒక్కోసారి మబ్బులు పట్టిన ఆకాశం ఉరుముతూ వర్షాలకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఒకోసారి ఏవిధమైన హెచ్చరికలూ చేయకుండానే వర్షం వచ్చి మీదపడుతుంది. అందువల్ల వాతావరణ హెచ్చరికల గురించి తెలుసుకోవడం మంచిది. తగిన దుస్తులు: వర్షాకాలంలో పిల్లలే కాదు, ఎవరైనా సరే, తేలికగా ఆరిపోయే దుస్తులు ధరించడం మంది. తేలికపాటి దుస్తులను పిల్లలకు ధరింపజేయాలి. అసౌకర్యం, చికాకు కలిగించే దుస్తులను ఈ కాలంలో వారికి తొడగకపోవడం చాలా మంది. పాదరక్షల ఎంపిక: వర్షాకాలంలో మీ పిల్లలకు తగిన పాదరక్షలను ఎంచుకోండి. తడి ఉపరితలాలపై జారకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌తో ఉండే వాటర్‌ప్రూఫ్ బూట్లు లేదా చెప్పులను ఎంచుకోండి. దోమల నుంచి రక్షణ: వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దోమల నిరోధకాలను లేదా దోమతెరలను ఉపయోగించడంతోపాటు ఇంటి చుట్టూ దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా వరే నీటి వనరులు ఉండకుండా చూసుకోవడం మంచిది. పరిశుభ్రత పద్ధతులు: పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లను నేర్పాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్ని నొక్కి చెప్పండి, భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ఇంటి ఆవరణలో నిలిన నీరు, నీటి కుంటలు లేదా మురికి గుంటలు ఉన్న ప్రదేశాలలో ఆడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురిం పిల్లలకు అవగాహన కల్పించండి. అటువంటి నీటిలో వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి కాబట్టి నిల్వ ఉన్న నీటి లో ఆడకుండా చూడండి. ఆహార భద్రత: వర్షాకాలంలో ఆహార పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ అవసరం. స్ట్రీట్ ఫుడ్ లేదా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో నిల్వ ఉండే ఆహారం తీసుకోకుండా చూడాలి. పండ్లు, క్యారట్, బీట్రట్ వంటి పచ్చి కరగాయలను తినేముందు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి చేయడం అవసరం. తగినంత వెంటిలేషన్: భారీ వర్షాల సమయంలో కిటికీలు మూసి ఉంచడం చాలా కీలకమైనప్పటికీ, మీ ఇంటిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం తేమ పెరగకుండా నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలర్జీలు, ఆస్తమా నిర్వహణ: మీ పిల్లలకు అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నట్లయితే, వర్షాకాలం వారి ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం, అవసరమైతే తగిన మందులను సిద్ధం చేసుకోవడం మంచిది. పరిశుభ్రమైన నీరు: కాచి చల్లార్చిన నీటిని తాగడం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. రింగ్వార్మ్: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎరుపు, రింగ్–ఆకారపు దద్దురును కలిగిస్తుంది. దురద లేదా పొలుసులుగా ఉంటుంది. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు, తలమీద, గజ్జల్లో , పాదాలపై సర్వసాధారణంగా ఉంటుంది. దీని బారినుంచి పిల్లలను రక్షించుకోవాలి. ఈ కాలంలో రోజువారీ తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్ మారుతున్న సీజన్‌తో, ఆహార శైలులను కూడా మార్చడం అత్యవసరం. వ్యాధులు పెరుగుతున్న సమయంలో కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాలి. పసుపు కలిపిన పాలు, శొంటి కషాయం, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం, మొలకలు వంటి ఆరోగ్యకరమైన రుతిండి ఇవ్వాలి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ పిల్లల్లో మం బ్యాక్టీరియాను పెంచటానికి సహాయపడుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏదోరకంగా పిల్లలకు ఇవ్వాలి. తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి: ఈత లేదా స్నానం చేసిన తర్వాత పూర్తిగా శరీరాన్ని ఆరనివ్వటం మంచిది. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
మిర్చి పంటకు ‘తామర పురుగు’ముప్పు అందుకే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
Pesticides For Thamara Purugu Damage In Chilli Cultivation: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు’ మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి – ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో కనిపించాయి. ఈ ఏడాది రెండు, మూడు నెలలు ముందే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో విజృంభించాయి. వేలాది ఎకరాల్లో మిర్చి పంట పైముడతతో నాశనం అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేల రాలిపోతున్నాయి. కొందరు మిర్చి తోటలు పీకేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల మిర్చి తోటల్లో, దేశవాళీ మిరప రకాలు సాగు చేస్తున్న పొలాల్లో పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ఇవి కొత్త రకం తామర పురుగులు! ►గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంట పండించే రైతులు పూతను ఆశించే తామర పురుగులను గమనించారు. ఈ సంవత్సరం ముందుగా మిరప పంట వేసిన పొలాల్లో ఈ పురుగులను గమనించాం. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించి పూత రాలిపోయి, కాయగా మారకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. ►సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. తద్వారా ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకోవడం వలన ‘పై ముడత’ అని అంటారు. ఈ పురుగును నివారించుకోవడానికి రైతు స్పైనోసాడ్ (ట్రేసర్), ఫిప్రోనిల్ (రీజెంట్), డయాఫెన్ థయురాన్ (పెగాసస్), ఇంటర్ ప్రిడ్, ఎసిటామిప్రిడ్, క్లోరోఫెన్ పిల్ లాంటి మందులను వారం రోజుల వ్యవధిలో ఒకసారి లేదా రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా నివారించడం జరుగుతుంది. కానీ, ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు ఒత్తిడికి లోనవుతున్నారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు: ►రైతులు ఆందోళనతో విపరీతంగా మందులు కొట్టడం వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువైనట్లు గమనించాం. కాబట్టి, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి. ►రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లిపురుగులను నివారించుకునే అవకాశముంది. ►ఇవి మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యం కలిగి వున్నందున.. పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం. ►ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం. ►తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్ గాని ట్రైటాన్ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి. ►బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి). ►అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్ (ప్రైడ్) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా సైయాంట్రనిలిప్రోల్ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్ (40% ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ 40% ఔ+ 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ►మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు. ►పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి. ►విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి పరిశోధనలు పురోగతిలో వున్నాయి. – డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా.వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా dir-research@drysrhu.edu.in చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! -
శునకాలకు..సారీ..!
ఛీ కుక్క..అనే ముందు ఏం కుక్కా బాగున్నావా అని ఎవరైనా అంటారా? రాత్రుల్లో గూర్ఖాలా కాపలా కాస్తుంది దొంగలొస్తే భౌ..భౌ మంటుంది యజమాని నిద్రపోతుంటే చుట్టూ చక్కర్లు కొడుతుంది ఊరికెళుతుంటే ఏడుస్తుంది ఆకలైతే అన్ని ఇళ్లకూ తిరిగి జాలిగా చూస్తుంది.. చంటి పిల్లలకు చక్కిలిగింతలు పెడుతుంది పోలీసు కేసులను ఛేదిస్తుంది సర్కస్‌లో ఫీట్లు చేస్తుంది చివరకు యజమాని మరణిస్తే సమాధి దగ్గర కూర్చుని రోదిస్తుంది.. మళ్లీ ఆయన కనిపించాలని కాళ్లతో మట్టి తవ్వుతుంది ఇలాంటి కుక్కలను ఛీ అందామా.. శభాష్ అందామా.. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు మీ ప్రియ శునకాలకు వేయిస్తే నిశ్చంతగా ఉండొచ్చు వ్యాధి వస్తుందనే భయం వీడొచ్చు... సాక్షి, చీరాల అర్బన్: ర్యాబిస్ వ్యాధి సోకితే చికిత్స లేదనేది వాస్తవమే కానీ.. అన్ని కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుందనేని అపోహ మాత్రమే. అవగాహన లోపం కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ర్యాబిస్ వ్యాధి రాబ్డో అనే వైరస్ వలన సోకుతుంది. ఈ వైరస్ ఎక్కువగా అడవుల్లో ఉండే క్రూర జంతువులు, గబ్బిలాల్లో ఎటువంటి లక్షణాలు చూపించకుండా ఉంటుంది. ఈ వైరస్ గాలి, నీటి ద్వారా మార్పిడి చెందుతుంది. మృగాలు, గబ్బిలాలు చనిపోవడం, వాటిని కుక్కలు తినడం వలన వాటిలో ఉన్న వైరస్ కుక్కలకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ఉన్న కుక్కలు మనుషులను, పశువులపు కరవడం వలన లాలాజలం ద్వారా సంక్రమిస్తుంది. ర్యాబిస్ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 35 వేల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలు 60 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ వైరస్ మనుషులకు, పశువులకు వ్యాప్తి చెందడంలో కుక్కలు వారధిగా పనిచేస్తుంటాయి. చనిపోయిన ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులను, గబ్బిలాల కళేబరాలను కుక్కలు తినడం వలన ఈ వైరస్ కుక్కలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన కుక్కలు మానసిక స్థితిని కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఈ వ్యాధి సోకిన కుక్కలు మనుషులను, పశువులను కరవడం వలన వ్యాధి సోకి వింతగా ప్రవర్తిస్తారు. వ్యాధిని గుర్తించకపోవడం వలన కొన్ని రోజుల్లో జీవులు మరణిస్తాయి. పెంపుడు కుక్కలతో పాటు వాటిని పెంచేవారికి, డాక్టర్లు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ర్యాబిస్ వ్యాధి సోకిన పశువులు, మనుషుల్లో లక్షణాలు ► ర్యాబిస్ వ్యాధి సోకడం వలన పశువుల ప్రవర్తనలో తేడా వస్తుంది. మూలగడం, ఒంటరిగా ఉండడం ► శరీరంపై దురద, కోపం, ఉలికిపాటుకు గురవడం ► అరుపులు ఆవలింతలా వస్తాయి, నీటిని తీసుకోవు, పక్షవాతంలా వచ్చి మరణిస్తాయి. ఇవన్నీ 11రోజుల్లో జరిగిపోతాయి. మనుషుల్లో... జ్వరం రావడం, కాళ్ళు పట్టుకుపోవడం, నీరు తాగలేకపోవడం, చూపులో మార్పు రావడం, భయపడిపోవడం, పక్షవాతం వచ్చి శరీరం పనిచేయకుండా పోయి మరణించడం జరుగుతుంది. నివారణ చర్యలు : ►ఈ వైరస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. అలానే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాటికి వ్యాక్సినేషన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురంచి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు కుక్కల వలన కలిగిన వ్యాధులను గురించి వివరించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకి కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అందుబాటులో రేబీస్ వ్యాక్సిన్ ► పెంపుడు కుక్కల యజమానులు రేబిస్ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకోవాలి ► జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని అన్ని ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ వి.రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారన్నారు. మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ప్రధానమైనది రేబిస్ వ్యాధి అని పేర్కొన్నారు. దీంతో పాటు ఆంత్రాక్స్, బ్రూసుల్లో సిస్, లెఫ్టాస్ ఫైరోసిస్ వ్యాధులు కూడా పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయన్నారు. అయితే కొన్నింటికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లాలోని మొత్తం 27 ప్రధాన పశువైద్యశాలల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు. శనివారం జూనోసిస్ డే సందర్భంగా అన్ని పశువైద్యశాలల్లో కుక్కలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కుక్క పిల్లకు 90 రోజుల వయస్సు వచ్చేటప్పటికి మొదటి విడతగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. మూడు నెలలకు బూస్టర్ డోస్ వేయించుకోవాలని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే రోజుకి యాంటీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రెగ్యులర్‌గా వ్యాక్సిన్ వేయించుకుంటే పెంపుడు కుక్కలకు వ్యాధి రాదన్నారు. అన్ని పశువైద్యశాలలతో పాటు ఒంగోలులోని సంతపేటలో ఉన్న జిల్లా పశువైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న పశువైద్యశాలలో కూడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒంగోలు వైద్యశాలకు 800 డోసులు అందించామని వివరించారు. అదే విధంగా జిల్లాలోని ప్రధాన పశువైద్యశాలలకు ఒక్కోదానికి 100 డోసుల వంతున ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పిచ్చికుక్క కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► కుక్క కరిచిన వెంటనే గాయాన్ని 4,5సార్లు నీటిని ధారగా పోస్తూ గాయాన్ని శుభ్రంగా కడగాలి. ► టించర్ అయోడిన్‌తో శుభ్రంగా కడగాలి. ► ఈ వైరస్ కుక్క కరిచిన 11 రోజుల నుంచి 6 సంవత్సరాల్లోపు లక్షణాలను ప్రదర్శిస్తుంది. ► ఈ వైరస్ రక్తంలో కలవకుండా నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ► సంబంధిత వైద్యుల సూచన మేరకు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. -
ఈగ.. యముడి మెరుపు తీగ
వాషింగ్టన్: దోమలు, బొద్దింకలు, ఇతర పురుగులు మన ఇంట్లోకి వస్తే వాటిని చంపడమో.. బయటకు తరమడమో చేస్తే గానీ మనకు నిద్రపట్టదు. అయితే ఇళ్లల్లోకి వచ్చే ఈగలను మనం అంతగా పట్టించుకోం. దీనికి కారణం అవి అంత ప్రమాదకరమైనవి కావని మనందరి అభిప్రాయం. కానీ మన అభిప్రాయం తప్పంటున్నారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులకు చెందిన హానికరమైన బ్యాక్టీరియాలను వందల సంఖ్యలో మన ఇళ్లల్లోకి ఈగలు మోసుకొస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విహారయాత్రల్లో ఈగల గోల ఎక్కువగా ఉంటుంది.. అక్కడికి తీసుకెళ్లిన ఆహారం, ఇతర వంట పదార్థాలపై అవి వాలిపోతాయి. అయితే ఇలా ఈగలు వాలిన ఆహారాన్ని తినవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 116 ఈగ జాతులపై పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఈగల కాళ్లు, రెక్కలను పరిశీలించగా.. కాళ్లపై అధిక శాతం హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈగలు వాలినప్పుడు ఇవి ఒకచోట నుంచి మరోచోటుకి వ్యాప్తి చెందుతున్నాయని వర్సిటీ పరిశోధకులు స్టీఫెన్ షుస్టెర్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మురికి కూపాల్లో జనావాసాలు
ఇండ్ల మధ్యలో నిలుస్తున్న మురుగునీరు చిత్తడవుతున్న అంతర్గత రోడ్లు ప్రబలుతున్న వ్యాధులు పట్టించుకోని అధికారులు దిలావర్పూర్ : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. 70శాతానికి పైగా ప్రజలు పల్లెలోనే జీవనం సాగిస్తున్నారు. అందుకే గాంధీజీ పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్నాడు. కానీ ప్రస్తుతం పల్లెలను పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయాడు. కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. గ్రామాభివృద్ధే ధ్యేయం అంటూ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలు, అధికారులు పల్లె ముఖం చూడడం లేదు. ఇందుకు తార్కాణమే మండల కేంద్రమైన దిలావర్పూర్ గ్రామం. దిలావర్పూర్ గ్రామంలో ప్రస్తుతం గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే వ్యాధులు ప్రబలుతాయి అని జిల్లా అధికారులు తరచూ పేర్కొనే మాటలివి. వాస్తవానికి గ్రామంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రై నేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు ఇండ్ల మధ్యలో ప్రవహించి అంతర్గత రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ బురదమయం కావడంతో ప్రజలు ఇండ్లలోంచి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందుల పాలవుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి ఉండడంతో దోమలు పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన స్థానిక పంచాయతీ పాలకవర్గం, అధికారులు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. సాక్షాత్తు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లోని ఇండ్ల మధ్య మురుగునీరు ప్రవహించి ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో తీవ్ర దుర్గందంతో పాటు దోమల వ్యాప్తి అధికంగా ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే పలు వార్డుల్లో సైతం అంతర్గత రోడ్లు డ్రై నేజీలు లేని కారణంగా కురుస్తున్న వర్షాలకు జనావాసాలన్నీ కంపుకొడున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుత వర్షా కాలంలో తాము ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల పాలవుతున్నాం గామ్ గంగారాం, దిలావర్పూర్ తమ కాలనీలో అనేక రోజులుగా తీవ్ర సమస్యలు పడుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. మా ఇండ్ల మధ్య మురుగునీరంతా ఒకచోటికి చేరి తీవ్ర దుర్గందం వ్యాపిస్తోంది. దోమలు, ఈగల బెడదతో నిత్యం ఇబ్బందులు పడుతూ జ్వరాల బారిన పడుతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలి. రోడ్లు బురదగా మారుతున్నాయి – ఖలీం, దిలావర్పూర్ గ్రామంలో డ్రెయినేజీలు సక్రమంగా లేకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు ప్రవహించి రోడ్లన్నీ బురదగా మారుతున్నాయి. నీరు నిలిచి ఉండడంతో దోమలు, ఈగలు అధికమయ్యాయి. దీంతో ఇండ్లలో నివసించాలంటేనే ఇబ్బందిగా ఉంది. పలుమార్లు పంచాయతీ వారికి తమగోడును విన్నవించినా పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. దోమలతో వేగలేకపోతున్నం – చాతిరి లక్ష్మి, దిలావర్పూర్ రోడ్లు, మురుగు కాలువలు అధ్వానంగా ఉండడంతో రోజూ ఇబ్బందుల పాలవుతున్నం. నాలుగు రోజులగా వర్షం పడుతోంది. దీంతో నీరు అంతా రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. సర్కారోళ్లు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకుని రోగాల బారిన పడకుండా చూడాలి. చర్యలు చేపడతాం.... – సరస్వతి, కార్యనిర్వహణాధికారిణి, దిలావర్పూర్ గ్రామ శివారు కాలనీలతో పాటు గ్రామంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు బురదమయంగా ఉన్న మాట వాస్తవం. పరిస్థితి జఠిలంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి మురుగునీరు నిలువ ఉండకుండా చేసి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడతాం. అలాగే ఇండ్ల మధ్యలో ఉన్న గుంతలను పూడ్చి నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపడతాం. నూతనంగా రోడ్లనిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణాన్ని సైతం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తాం. -
అతిసారా.. ప్రాణాంతకం
సీజనల్ వ్యాధుల్లో అతి భయంకరమైంది ఇదే జాగ్రత్తలు వహించాలటున్నా వైద్యులు.. చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి కెరమెరి : వర్షాకాలం వచ్చేసింది. ఇక అంతా జాగ్రత్త ఉండాల్సిందే. ఏటా వచ్చే సీజనేబుల్ వ్యాధుల్లో ప్రధానమైనవి అతిసారా.. వర్షాకాలంలో పారిశుధ్యలోపం. తాగునీరు, కులషితమై ఈ వ్యాధి సోకుతుంది. అతిసారా వ్యాధి సోకితే వాంతులు, వీరేచనాలు అధికమై శరీరం అదుపు తప్పుతుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది. ఈ వ్యాధి ఒక్కో సారి ప్రాణాలను కూడా హరిస్తుంది. వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్యుల సలహలు తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చు. అయితే అతిసారా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులకు గురవ్వాల్సిన అవసరం ఉండదు. తీసుకోవల్సిన జాగ్రత్తలు..! – రోజు లీటర్ల నీటికి 50 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపాలి. – రక్షిత నీటి పథకం పైప్‌లైన్ వాల్వుల్లో ఏదైనా లీకేజీ అయితే వెంటనే గ్రామీణ నీటి సరఫరా అధికారులకు తెలియజేయాలి ‘ గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత నీటి సరఫరా ట్యాంకులు ప్రతి పదిహేను రోజులకోసారి శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. ‘ గుంతల్లో ఉండే నల్లాల దగ్గర నీరు కలుషతమయ్యే అవకాశముంది. అక్కడా పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ‘ పబ్లిక్ నల్లాలు, చేతిపంపుల వద్ద దుస్తులు ఉతకరాదు. ‘ వేడిచేసి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలి ‘ తాగు నీటిని శుభ్రపరచడానికి ఒక బిందెడు నీళ్లల్లో ఒక క్లోరిన్ బిళ్ల వేసి అరగంట ఆగిన తర్వాత ఈ నీటిని తాగాలి. క్లోరిన్ బిళ్లలు ప్రతీ ఆరోగ్య కార్యాకర్త వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయి. అతిసారా సోకిన వ్యక్తికి వెంటనే ఓరల్ డిహైడ్రేషన్ ద్రావణం తాగించాలి. ఈ ద్రావణాన్ని ఆరోగ్యవంతులు కూడా తీసుకోవచ్చు. ‘ నియంత్రణ కాకుంట దగ్గర్లోని పీహెచ్‌సీకి లేదా ప్రై వేటు వైద్యశాలకు తీసుకెళ్లాలి. ‘ పైపుల ద్వారా నీటి సరఫరా ఉన్న చోట మురుగు కాల్వలోకి వెల్లకుండా చూడాలి. ‘ మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి. ‘ తినే ఆహారం పై మూతలు ఉంచాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని బాగా మగ్గిన పండ్లను తినరాదు. రోడ్లపై తినుబండారాలకు దూరంగా ఉంటేనే మంచిది. ‘ ఈగలు, దోమల నుంచి రక్షణలేని దుకాణాల్లో తినబండారాలను కొనరాదు. ‘ అవేకాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా సురక్షితంగా ఉండవచ్చు. జాగ్రత్తలతో వ్యాధికి దూరం.. అతిసారా రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలి. మరగకాచిన నీటిని చల్లార్చి వడపోసిన తర్వాత త్రాగాలి. త్రాగు నీటి బోర్లు, పబ్లిక్ నల్లాలు కలుషితం కాకుండా చూసుకోవాలి. అతిసారా సోకిన వ్యక్తి వెంటనే ఓరల్ డిహైడ్రేషన్ ద్రావణం తాగాలి. వాంతులు, వీరేచనాలు వచ్చిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి, నల్వున్నాహారం, మగ్గినపళ్లు తినరాదు. – శ్రీనివాస్, వైద్యాధికారి, పీహెచ్సీ కెరమెరి 90