ప్రతీకాత్మక చిత్రం
గురక చాలా మందికి సాధారణ సమస్య. ఇది బాధితుడిని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా పక్కనున్న వారిని బాగా ఇబ్బంది పెట్టే సమస్యే. అలాంటిది మీ భాగస్వామే గురకతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఆ సమస్య రోజూ ఎదురైతే పరిస్థితి ఏంటి..?. ఇలాంటి పరిస్థితే ఎదురైనా ఓ వ్యక్తి ఆ సమస్యకు ఓ గమ్మత్తయిన పరిష్కారాన్ని కనుగొన్నాడు.
వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల జాన్ అబ్రహం తన ప్రియురాలు షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు నిద్రలో గురకపెట్టే సమస్య ఉంది. దీంతో జాసన్ అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. అయితే ప్రియురాలు గురక పెట్టకుండా.. ఆ సమయంలో తనను నిద్ర నుంచి లేపకుండా గురక తగ్గించడానికి అనేక ప్రయోగాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్ ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది.
వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోవడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. షార్ని బ్రైట్ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్ నో కామెంట్ అంటూ సమాధానమిస్తున్నాడు. (హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment