
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.
అనంత్-రాధికల పెళ్లి జులై 12న జరగనుంది. దేశవ్యాప్తంగా అంబానీ అభిమానులు ఈ వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్నీ హాట్‌స్టార్ ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.
అనంత్ అంబానీ-రాధికల జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.
Comments
Please login to add a commentAdd a comment