Ankita Lokhande and Vicky Jain Mehendi Ceremony Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Ankita Lokhande: సుశాంత్‌ సింగ్‌ మాజీ ప్రేయసి పెళ్లి.. మెహందీ ఫంక్షన్ ఫోటోలు వైరల్‌

Published Sun, Dec 12 2021 4:32 PM | Last Updated on Sun, Dec 12 2021 6:15 PM

Ankita Lokhande and Vicky Jain Mehendi Ceremony Photos Goes Viral - Sakshi

బాలీవుడ్‌ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అంకిత- విక్కీజైన్‌లు డిసెంబర్‌ 14న మూడుముళ్ల బంధంతో ఒకటికానున్నారు. ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌ ఈ వివాహ వేడుకకి వేదిక కానుంది. ఇప్పటికే అంకిత ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. శనివారం(డిసెంబర్‌ 11) అంకిత- విక్కీల ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు.

తాజాగా అంఖితా మెహందీ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లి వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్‌ నిరూపించుకునేందుకు 'టాలెంట్‌ హంట్‌' రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్‌ వచ్చింది.

ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్‌ సింగ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంది. కంగనా రనౌత్‌ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది.  సుశాంత్‌తో బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. పెద్దల అనుమతితో ఇప్పుడు పెళ్లిపీటలెక్కుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement