రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎందరో అతిరథ మహారథులు, ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా తన కుటుంబంతో సహా పాల్గొంది. ఈ వేడుకలో ఆమె దేశీ అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 1న జరిగిన అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇవాంకా తన భర్త జారెడ్ కుష్నర్, కుమార్తె అరబెల్లా రోజ్‌తో కలిసి సందడి చేసింది.
ఇదొక 'మ్యాజికల్ రాత్రి" అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఆమె ఆ వేడుకల్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ సిల్వర్ కలయిక గల చీరను ధరించింది. అందుకు తగట్టుగా వీ షేప్‌లో ఉండే మ్యాచింగ్ బ్లౌజ్‌తో గ్రాండ్ లుక్‌లో కనిపించింది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 2.65 లక్షలు. అంతేగాదు ఆ చీరకు తగ్గ రేంజ్‌లో చెవులకు డైమండ్ జూకాలు ధరించింది. మంచి గ్లామరస్ లుక్‌లో అందర్నీ మిస్‌మరైజ్ చేసింది.
ఇక రెండో రోజు జంగిల్ సఫారీలో జరిగిన వేడుకల్లో ఇవాంకా త్రెడ్ వర్క్‌తో కూడిని కుర్తాని ధరించింది. సింపుల్ మేకప్‌తో తన కూతురు అరబెల్లా రోజ్‌తో కలిసి సందడి చేసింది. ఇక అదే రోజు సాయంత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన తెల్లటి లెహంగాలో భారతీయ వనితలా రెడీ అయ్యింది.
ఇక చివరి రోజు ఉదయం గోల్డెన్ ఎంబ్రాయిడరీతో కూడిన తెల్లటి గౌనుతో ఆకర్షించింది. ఇకా ఆమె భర్త, కూతురు కూడా దేశీ వస్త్రాధారణలో అలరించడం విశేషం. ఇక అదే రోజు సాయంత్రం అంబానీ కుటుంబం దేవుడి పూజలతో ఆ వేడుకలకు ముగింపు పలికే కార్యక్రమం కావడంతో వచ్చిన అతిధులందరికి సంప్రదాయ డ్రెస్ కోడ్‌ని ధరించాలని సూచించడం జరిగింది.
దీంతో ఇవాంకా ఆ సాయంత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన నిమ్మపండు రంగు కశ్మీరీ లెహంగాతో సంప్రదాయ మహిళ వలే కనిపించింది. ఈ లెహంగా ధర అక్షరాల రూ. 5 లక్షలు.
ఏదీఏమైన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో పాల్గొన్న విదేశీయులు సైతం మన భారతీయ సంస్కతి తగ్గ వస్తాలంకరణలో కనిపించడం గ్రేట్ కదూ. బహుశా ఆ క్రెడిట్ అంతా అంబానీ కుంటుంబానికే దక్కుతుంది.
(చదవండి: అనంత్-రాధికా: నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment