Rana and Miheeka Wedding: Miheeka Bajaj's Haldi Ceremony Look | హల్దీ వేడుక, మెరిసిపోతున్న మిహికా - Sakshi
Sakshi News home page

హల్దీ వేడుక : మెరిసిపోతున్న మిహికా 

Published Thu, Aug 6 2020 2:42 PM | Last Updated on Thu, Aug 6 2020 4:54 PM

 Miheeka Bajaj haldi ceremony look ahead of wedding with Rana Daggubati - Sakshi

సాక్షి, హైదరాబాద్ : మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి వేడుక సందడి మొదలైంది.పెళ్లి పనుల హడావిడి ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభమైంది. పెళ్లికూతురు మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక  సీషెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు. (రానా-మిహికా వివాహం; వీరికి మాత్రమే ఆహ్వానం)

కాగా రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8న  రానా తన ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. రానా, మిహికా కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు, చెఫ్‌లు, సర్వర్‌లను కూడా పరీక్షిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు నిర్మాత సురేష్ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement