
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు.
"ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్ తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి) అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్‌గా రూపొందించిన ఫేక్ వీడియో ఇది.
JIO, after some years of free internet pic.twitter.com/VlFPKrsq6g
— Tweeting Quarantino (@rohitadhikari92) March 5, 2024
కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్‌లో తెగ షేర్ అవుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ వీడియోపై కమెంట్ చేశారు. అయితే ఇది రివర్స్ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది. మరి కొంతమంది యూజర్స్ జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
ఇదీ అసలు వీడియో..
In run up to marriage ceremony of Anant Ambani, community feast are being organized in villages around the Jamnagar refinery.
— Kumar Manish (@kumarmanish9) February 28, 2024
Today, in Jogvad village, Billionaire #MukeshAmbani himself seen offering food to the guests in a community feast.
pic.twitter.com/0Nb7dWMdVM
కాగా అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చంట్‌తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు. గత ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్ బాష్ నిర్వహించారు. బాలీవుడ్‌సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సహా పలువురు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment