సాక్షి, హైదరాబాద్ : జనవరి 1నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆదివారం మీడియాతో వెల్లడించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ.. నుమాయిష్ ఎగ్జిబిషన్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీక అని వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది జరిగిన అగ్రి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తసుకుంటున్నారని తెలిపారు.
ప్రమాదాలను నివారించేందుకు ప్రతి 30 మీటర్లకు ఫైర్ హైడ్రాన్ట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఫైర్ కంట్రోల్ వెహికిల్స్ సులువుగా తిరిగేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. లక్షా 50 వేల లీటర్ల నీటిని నిలువ ఉంచేందుకు రెండు వాటర్ సంపులను, 9 ఎమర్జెన్సీ కిట్స్ మార్గాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను, నిఘాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25 నుంచి గ్రౌండ్‌లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అంజనీకుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment